SBI తో Hero Electric ఒప్పందం..
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయవచ్చని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది.
రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో వినియోగదారుల సౌలభ్యం కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ SBIతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది.
ఈ భాగస్వామ్యం వల్ల తక్కువ వడ్డీ రేట్లతోపాటు ప్రత్యేకమైన ఆఫర్లు వినయోగదారులకు అందుతాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో పెట్టుబడి పెట్టేందుకు లాభదాయకమైన డీల్స్ / స్కీమ్‌ల కోసం చూస్తున్నారు” అని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ భాగస్వామ్యంపై SBI చీఫ్ జనరల్ మేనేజర్ (పర్సనల్ బ్యాంకింగ్ బిజినెస్ యూనిట్) దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తక్కువ EMIలతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును సరళవంతంగా చేయడం ద్వారా దేశంలోని గ్రీన్ మొబిలిటీ విప్లవానికి తమ బ్యాంక్ ముందడుగు వేసిందని పేర్కొన్నారు.
Hi
[…] ప్రముఖ ఈవీ తయారీ దిగ్గజం Hero Electric ప్రకటించింది. ఇటీవల కొన్ని […]
[…] extended warranty (రెండు సంవత్సరాల వరకు) కనీస ధర రూ.2,287 తో […]