సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom

BattRE show roon
Spread the love

BattRE virtual showroom : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BattRE కంపెనీ ఇటీవ‌ల తన వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వర్చువల్ షోరూమ్‌కు సంబంధించి కస్టమర్‌లకు రియ‌ల్ టైం ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) (augmented reality (AR)) వినియోగించింది. ఈ వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన BattRE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

BattRE virtual showroom  ప్రారంభం గురించి ఆ  సంస్థ వ్యవస్థాపకుడు/ డైరెక్టర్ నిశ్చల్ చౌదరి మాట్లాడుతూ  ఈవీ రంగంలోనూ ఆన్‌లైన్ రిటైల్ సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.

ఈవీ రంగం అభివృద్ధి క్ర‌మంలో భౌతిక, డిజిటల్ విధానంలో  అత్యంత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కొనుగోళ్ల  అనుభవాన్ని అందించడానికి ఈ డిజిట‌ల్ విర్చువ‌ల్ షోరూంను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.
వర్చువల్ షోరూమ్ .. ఇమేజిన్ కస్టమర్‌లకు వారి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహాయకారిగా ఉంటుంద‌ని చెప్పారు. వినియోగదారుల కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్రభావితం చేయడానికి వర్చువల్ షోరూమ్ కస్టమైజేషన్ సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడింద‌ని వివ‌రించారు.  వినియోగదారులు బ్యాట్రే అధికారిక వెబ్‌సైట్ హోమ్ పేజీలోని ట్యాబ్ ద్వారా ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

డిజిటల్ షోరూమ్ లేదా వర్చువల్ షోరూమ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా అధిక ప్రాధాన్యతను సంత‌రించుకుంది. . కోవిడ్-19 మహమ్మారి కార‌ణంగా సామాజిక దూరం అవసరం పెరిగింది. పెరిగిన డిజిటలైజేషన్ దీని వేగాన్ని మరింత వేగవంతం చేశాయి. టెక్-ఆధారిత స్టార్టప్‌లు డిజిటల్ షోరూమ్‌లను కలిగి ఉండటంపై దృష్టి సారిస్తున్నాయి. టాటా మోటార్స్,టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, స్కోడా, హోండా మోటార్‌సైకిల్స్ వంటి ఆటోమేకర్లు కూడా తమ వర్చువల్ షోరూమ్‌లను ప్రారంభించాయి.

BattRE virtual showroom లో BattRE రైడర్‌లు ట్రిప్ హిస్టరీలు, రీఛార్జ్ స్టేషన్‌ల స్థానాలు, కాల్ అలర్ట్‌లు, స్పీడోమీటర్‌లో నావిగేషన్ సహాయం వంటి సమాచారాన్ని తనిఖీ చేయడానికి  సాయ‌ప‌డే యాప్‌ను కూడా ఇట్ర‌డ్యూస్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *