Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

Spread the love

Hero Motocorp vida sway | దేశంలోని దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) మునుపెన్నడూ చూడని వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించింది.  ముందు వైపు రెండు చక్రాలు కలిగిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ కొత్త తరహా  త్రీ వీలర్‌(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూడండి..

భారత మార్కెట్లో అతిపెద్ద టూ వీలర్‌ తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం మార్కెట్ లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది.  అదే Hero Vida V1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్  కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే  ఇప్పుడు ఈ మోడల్‌ను హీరో త్రీ-వీలర్‌గా అభివృద్ధి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ స్కూటర్ ను హీరో వరల్డ్‌ 2024 ఈవెంట్‌లో ఆవిష్కరించింది.

హీరో విడా వి1 (Hero Vida V1 Based Trike Concept) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ సిద్ధం చేస్తోంది.  అయితే డిజైన్‌ పరంగా ఇందులో పెద్దగా మార్పులేమీ చేయనట్టు కనిపిస్తోంది. అయితే ముందు భాగంలో ఒక చక్రానికి బదులుగా రెండు చక్రాలను అమర్చడం దీని ప్రత్యేకత. ముందు వైపు రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రంతో   త్రీ వీలర్‌ గా మారింది. అంతే కాకుండా హీరో త్రీ వీలర్‌ ఇ-స్కూటర్‌లో ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా మార్చినట్లుగా తెలుస్తోంది. కాగా హీరో కంపెనీ ఈ వాహనాన్ని కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే అభివృద్ధి  చేసింది. ఈ కొత్త ఇ స్కూటర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనే వివరాలు  ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే విడుదలయ్యే చాన్స్  ఉంది.

Hero Motocorp vida sway

హీరో విడా స్వే(Hero Vida Sway) పేరుతో..

హీరో విడా స్వే(Hero Vida Sway) పేరుతో ఈ త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్‌ త్వరలో విడుదల చేస్తోంది. ఇది ఒక ట్రైక్‌ (Hero Vida Sway Trike) రకం  వెహికిల్. కాగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ రకమైన స్కూటర్‌కు మంచి క్రేజ్  వస్తుండడంతో.. భారత్‌ లోనూ దీన్ని తీసుకురావాలని సంస్థ  ప్రణాళికలు రూపొందిస్తోంది. .

హీరో తీసుకొస్తున్న ఈ విడా స్వే ట్రైక్‌ స్కూటర్‌ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిపై ప్రయాణిస్తున్నప్పుడు కింద పడే  ప్రమాదం ఉండబోదు. అంతే కాకుండా ఈ వాహనానికి స్టెబిలిటీ ఉంటుంది. ఈ స్కూటర్‌ మోడల్‌ను విడా V1 Pro  మోడల్‌ను పోలి ఉంటుంది.. బాడీ ప్యానెల్‌లు, హెడ్‌లైట్‌,  పెయింట్‌ ఫినిషింగ్‌ తీరు ఈ రెండు స్కూటర్లలో ఒకేలా ఉంటుంది.  హీరో విడా స్వే ట్రైక్‌ స్కూటర్‌లో రెండు ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు అందించారు. దీని ద్వారా  పర్ ఫెక్ట్ బ్రేకింగ్‌ను పొందవచ్చు. విడా స్వేలో ఇలాంటి అనేక ఇతర ఫీచర్లను కూడా చూడవచ్చు. అయితే పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు   వెలుగులోకి వస్తాయి.    కానీ ఈ త్రీ వీలర్‌ స్కూటర్‌ ఆవిష్కరణతో.. హీరో విడా స్వే ఇప్పటికే ప్రజలను విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.  ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే వారిని ఈ స్కూటర్‌ ఎంతో ఆకట్టుకుంటోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..