Hero MotoCorp Hero vida v1 offers

Hero Vida VX2 | స్మార్ట్ ఫీచర్లతో అతి తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే విడుదల

Spread the love

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీ విడా వీఎక్స్‌2 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న‌ విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచ‌బుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది.

హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూట‌ర్ గా నిల‌వ‌నుంది. ముఖ్యంగా ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను తొల‌గించి బదులుగా డ్రమ్ బ్రేక్ లతో వస్తుంది.

డిజైన్ పరంగా, Vida VX2 Electric Scooter క్లీన్, సింపుల్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ తెలుపు, ఎరుపు, నీలం, పసుపు, నారింజ, నలుపు, బూడిద రంగులతో సహా మోనోటోన్ రంగులలో వ‌స్తుంది. ఇది విడా V2 మోడళ్లలో అందుబాటులో ఉన్న డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లను వ‌దులుకుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Vida VX2 – స్పెసిఫికేషన్స్ (అంచ‌నా)

విడా VX2 రెండు వేరియంట్లలో వస్తుంది: గో మరియు ప్లస్. బ్యాటరీ సామర్థ్యం, రైడింగ్ రేంజ్ పరంగా రెండు వేరియంట్లలో తేడా ఉంటుంది. గో వేరియంట్ 2.2 kWh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది, ప్లస్ వెర్షన్ 3.4 kWh బ్యాటరీతో రావచ్చు. రెండు వెర్షన్లు రెండు రిమూవ‌ల్ బ్యాట‌రీ యూనిట్లతో వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది వినియోగదారులకు సౌకర్యాన్ని అందిస్తుంది. స్కూటర్ ఒకే ఛార్జ్‌లో దాదాపు 100 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని భావిస్తున్నారు.

తక్కువ ధరకు వస్తుందా?

V2 సిరీస్‌తో పోలిస్తే Vida VX2 చిన్న TFT డిస్ప్లేతో వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదనంగా, ఇది స్మార్ట్ కీలెస్ స్టార్ట్ కంటే కీహోల్-ఆధారిత ఇగ్నిషన్ సిస్టమ్‌తో వస్తుంది. , Vida VX2 ధర లక్ష రూపాయలు ఎక్స్-షోరూమ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త విడా స్కూట‌ర్ బజాజ్ చేతక్, ఓలా S1 ఎయిర్, TVS iQube వంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్లకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది Vida VX2 భారతీయ మార్కెట్లో నమ్మకమైన కానీ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను టార్గెట్ గా పెట్టుకుంది.



హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోండి..

More From Author

Montra Super Cargo

Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

Tata Harrier EV

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *