Highest Range Electric Auto

బజాజ్ ఆటో సంచలనం: సింగిల్ ఛార్జ్‌పై 296 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో విడుదల!

Spread the love

Highest Range Electric Auto | పుణేకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto Ltd) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 9, 2026న తన నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ‘WEGO P9018’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనం, భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌గా చరిత్ర సృష్టించింది.

WEGO P9018: టాప్ టెక్నికల్ ఫీచర్లు

ఈ వాహనం కేవలం రేంజ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.
అతిపెద్ద బ్యాటరీ: ఇందులో 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే అత్యధికం(Highest Range Electric Auto).
సర్టిఫైడ్ రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 296 కిలోమీటర్ల దూరం(సర్టిఫైడ్ రేంజ్) ప్రయాణిస్తుంది.
పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్: ఇందులో టూ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 36% గ్రేడబిలిటీ ఉంది. దీనివల్ల కొండ ప్రాంతాలు, ఎత్తైన వంతెనలపై వాహనం సులభంగా వెళ్తుంది.
స్మార్ట్ టెక్నాలజీ: అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS), రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.

బజాజ్ WEGO P9018 టెక్నికల్ స్పెసిఫికేషన్స్

ఫీచర్వివరాలు
మోడల్ పేరుబజాజ్ WEGO P9018
బ్యాటరీ సామర్థ్యం17.7 kWh (లిథియం-అయాన్)
సర్టిఫైడ్ రేంజ్296 కిలోమీటర్లు (సింగిల్ ఛార్జ్‌పై) Highest Range Electric Auto
గరిష్ట వాలు సామర్థ్యం (Gradeability)36%
ట్రాన్స్‌మిషన్2-స్పీడ్ గేర్ బాక్స్
టెక్నాలజీఅప్‌గ్రేడ్ చేసిన BMS & రిజనరేటివ్ బ్రేకింగ్
వారంటీ5 సంవత్సరాలు
ధర (ఎక్స్-షోరూమ్)₹4,41,247
లక్షిత మార్కెట్పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలు

వ్యాపార వినియోగదారులకు లాభదాయకం

బజాజ్ ఆటో ఇంట్రా-సిటీ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సమర్‌దీప్ సుబంధ్ మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌యాణికుల సామాగ్రిని మోసే సామర్థ్యం, ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు కావాలనుకునే ఆపరేటర్ల కోసం దీనిని ఈ ఆటోను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ వాహనంపై కంపెనీ 5 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.

ధర, లభ్యత

బజాజ్ WEGO P9018 ఎక్స్-షోరూమ్ ధర (పాన్-ఇండియా) ₹4,41,247 గా నిర్ణయించబడింది. ప్రపంచవ్యాప్తంగా ₹2 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి ద్విచక్ర వాహన సంస్థగా బజాజ్ ఇప్పటికే గుర్తింపు సాధించింది. ఇప్పుడు ఈ కొత్త లాంచ్‌తో ఎలక్ట్రిక్ విభాగంలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

“మీరు మీ పాత డీజిల్ లేదా పెట్రోల్​ ఆటోను మార్చాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి”


మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

More From Author

Warangal Market Prices Today

వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *