జూయి యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Juiy App | హైదరాబాద్ : సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పర్యావరణానికి హాని కలుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. పెట్రోల్ వాహనాలు విడుదల చేసే కార్బన్ ఉద్గరాలతో వాతావరణ మార్పులను వేగవంతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
కాగా జూయి యాప్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన దేశ ప్రగతికి చోదక శక్తులు అని, పరివర్తనాత్మక చలనశీలత పరిష్కారాన్ని అందించేందుకు జూయి యాప్ వ్యవస్థాపకులు మహంత్ మల్లికార్జున, ప్రణయ్ కొమ్ముల కృషిని అభినందిస్తున్నామని తెలిపారు.
జూయి సహ వ్యవస్థాపకుడు మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికీ స్థిరమైన, సమర్థవంతమైన రవాణా ఎంపికలను అందించడమే తమ లక్ష్యం మని, తమ వినూత్న యాప్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో కొనుగోలుదారులకు సహాయపడాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
సహ వ్యవస్థాపకుడు ప్రణయ్ కొమ్ము మాట్లాడుతూ .. ఈ యాప్ వాహనం కనుగొనడం నుంచి డెలివరీ వరకు కస్టమర్‌లకు సహాయం చేస్తుందని తెలిపారు. మేము వచ్చే సంవత్సరంలో 1 మిలియన్ కొనుగోలుదారులను ICE (అంతర్గత దహన ఇంజన్లు) నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మార్చే లక్ష్యంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఈవీలపై అపోహలకు చెక్..
గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ సాంకేతికతలో సమూలమైన మార్పులు వచ్చాయి. అయినప్పటికీ, కొనుగోలుదారులలో ఈవీలపై అనేక అపోహలు ఉన్నాయి. జూయి ఈ అపోహలను పరిష్కరించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు దగ్గర చేయడంలో సహాయం చేస్తుంది. జూయి కస్టమర్‌లను కనుగొనడం మొదలు వాహనం డెలివరీ వరకు సహాయం చేస్తుంది. కొనుగోలు అవకాశం దేశం మొత్తానికి అందుబాటులో ఉండగా, వాహనాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే విక్రయించబడుతున్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ యాప్ దాదాపు అన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌లతో పనిచేస్తుంది. ఫైనాన్స్ కోసం యాక్సిస్ బ్యాంక్, లోన్‌టాప్, బీమా అవసరాల కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, చోలా ఏం ఎస్, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. వచ్చే సంవత్సరంలో 1 మిలియన్ కొనుగోలుదారులను ICE ( పెట్రోల్ వాహనాలు ) నుండి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మార్చే లక్ష్యంతో జూయి పని చేస్తుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..