Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

130km Range.. 65kmph Top speed

Spread the love
  • iVOOMi Jeet, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుద‌ల

  • ఎక్స్‌షోరూం ధరలు రూ. 82,999 నుంచి ప్రారంభం

iVOOMi Jeet electric scooter, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. దీని ధరలు రూ. 82,999, ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభమవుతుంది మరియు పూర్తి ఛార్జ్‌పై 130 కి.మీల రేంజ్‌ను అందజేస్తుంది.

iVOOMi సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగం iVOOMi iVOOMi Energy భారతీయ మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను (electric scooters ) విడుదల చేసింది. ఈ కంపెనీ భారతదేశంలో iVOOMi S1 అలాగే Jeet సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఇట్రొడ్యూస్  చేసింది, దీని ధరలు రూ. 82,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సింగిల్ ఛార్జింగ్‌తో 130 కి.మీల రేంజ్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది.

ivoomi zeet electric scooter
ivoomi zeet electric scooter

iVOOMi S1 electric scooter స్పెక్స్‌

iVOOMi S1 electric scooter ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది రూ.84,999 ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో విడుదల చేశారు. ఈ వాహ‌నం గంట‌కు 65 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్ల‌గ‌ల‌దు. ఇందులో 2kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమ‌ర్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60V, 2kWh మార్చుకోగల Li-ion బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 115 కి.మీల రైడింగ్ రేంజ్‌ని అందజేస్తుందని. 3-4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే ఇది 75 కిలోల కర్బ్ బరువును కలిగి ఉంది.

ivoomi s1 electric scooter
ivoomi s1 electric scooter

iVOOMi Jeet electric scooter

iVOOMi Jeet electric scooterscooter స్టాండర్డ్ / ప్రో అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 82,999, మరియు రూ. 92,999( ఎక్స్-షోరూమ్).  iVOOMi జీత్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5kWh బ్యాటరీ ప్యాక్ క‌లిగి ఉంటుంది. ప్రో వేరియంట్ 2kWh యూనిట్‌తో ప్యాక్ చేయబడింది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కిమీల రేంజ్‌ను అందజేస్తాయని కంపెనీ పేర్కొంది. iVOOMi Jeet సిరీస్ రెడ్, బ్లూ, గ్రే అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.

iVOOMi  ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్‌పై iVOOMi ఎనర్జీ వ్యవస్థాపకుడు & MD సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. “రెండు సంవత్సరాల విస్తృత పరిశోధన తర్వాత మా బృందం భారతీయ రోడ్లు, పర్యావరణ వ్యవస్థలో నిరూపించబడిన ఉత్పత్తులను అభివృద్ధి చేసింద‌ని తెలిపారు. భారతీయ వినియోగదారులకు అనుకూలంగా త‌మ స్కూట‌ర్ల‌లో అధిక సస్పెన్షన్‌లకు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు లెగ్‌రూమ్‌ను పెంచామ‌ని తెలిపారు.
————-

తెలుగులో టెక్ న్యూస్ కోసం techtelugu సంద‌ర్శించండి
మ‌రిన్ని వీడియోల కోసం Harithamithra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *