Komaki LY Pro electric scooter

రెండు బ్యాట‌రీల‌తో Komaki LY Pro ఎలక్ట్రిక్ స్కూటర్

Spread the love

5 గంటలలోపు 100% రీఛార్జ్

EV స్టార్టప్ Komaki కొత్త‌గా Komaki LY Pro electric scooter ను విడుదల చేసింది. ఇందులో 62V 32AH బ్యాటరీలు ఉన్నాయి, ఇవి రిమూవ‌బుల్ బ్యాట‌రీలు ఏకకాలంలో 4 గంటల 55 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, “మేము అధిక నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన EVల తయారీ ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పొంద‌గ‌లిగామ‌ని తెలిపారు. గ్రీన్/ క్లీన్ మొబిలిటీ డొమైన్‌లో ప్రముఖ సంస్థ‌ల్లో ఒకరిగా ఎదిగామ‌ని తెలిపారు. దృఢమైన డిజైన్, తక్కువ నిర్వహణ, లాంగ్ లైఫ్ ఉన్న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను రూపొందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

“మా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో Komaki LY ప్రో జ‌త చేశామ‌ని తెలిపారు. Komaki LY Pro వాహ‌నంలో TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్‌లు ఉన్న‌యి. అలాగే రెడీ-టు-రైడ్ ఫీచర్‌లను కలిగి ఉంది. సరికొత్త స్కూటింగ్ అనుభవాన‌ని ఇచ్చేందుకు మూడు గేర్ మోడ్‌లు ఉన్నాయి. అవి. ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, టర్బో మోడ్.

కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనాలు కూడా లెడ్ ఫ్రంట్ వింకర్‌లు, 3000 వాట్ హబ్ మోటార్లు/38 AMP కంట్రోలర్‌లు, పార్కింగ్ అసిస్ట్/క్రూయిజ్ కంట్రోల్ మరియు రివర్స్ అసిస్ట్‌లతో రూపొందించబడ్డాయి.

Komaki LY Pro electric scooter గరిష్టంగా గంట‌కు 58 – 62 కి.మీ వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. కొండలపై వాహనాలు జారిపోకుండా ఉండేందుకు ఈ బైక్‌లలో అధునాతన యాంటీ స్కిడ్ టెక్నాలజీని వినియోగించారు. బైక్‌లలో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.

More From Author

Okaya EV discount offers

Okaya EV discount offers .. ఇ-స్కూటర్‌లపై రూ. 5,000 వరకు తగ్గింపు

2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...