ఇంధన ధరలు అమాంతం ఆకాశాన్నంటుతుండడంతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన charging station (ఛార్జింగ్ స్టేషన్లు ) బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు మాత్రం ఇంకా సరిపపడా అందుబటులో లేవు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇప్పుడు దేశంలో బడా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ ను గురువారం గురుగ్రామ్ సెక్టార్ 86లో ప్రారంభించారు. అక్కడి ఎలక్ట్రిక్ వినియోగదారులకు ఇది శుభవార్త.
ఒక్కసారి 1000 కార్లకు చార్జింగ్
ఈ ఛార్జింగ్ స్టేషన్ ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో ఏకంగా 141 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ అతి పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌లో కేవలం 24 గంటల్లో 1,000 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయవచ్చు.
ఈ ఛార్జింగ్ స్టేషన్‌ను Alektrify అనే కంపెనీ ఇన్‌స్టాల్ చేసింది. కాగా గత నెలలో ఇదే గురుగ్రామ్‌లోని సెక్టార్ 52లో పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 75 ఏసీ స్టాండర్డ్ ఛార్జర్, అలాగే 25 డిసి ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. డీసీ ఛార్జర్‌తో 24 గంటల్లో 570 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయవచ్చు. ఇక ఏసీ ఛార్జర్ తో రోజుకు 600 కార్లను ఛార్జ్ చేసే వెసులుబాటు ఉంది.
Alektrify కంపెనీ ఏరాటు చేసిన ఈ ఛార్జింగ్ స్టేషన్ లో రెండు రకాల ఛార్జర్‌లను ఉపయోగించి 24 గంటల్లో మొత్తం 1,000 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయవచ్చు. దీనిని బట్టి రోజుకు 1000 ఎలక్ట్రిక్ కార్లకు ఈజీగా ఛార్జ్ చేస్తుంది. కేవలం30 రోజుల్లోనే ఈ చార్జింగ్ స్టేషన్‌ను నిర్మించినట్లు Alektrify పేర్కొంది.
30రోజుల్లోనే నిర్మాణం
ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై 60 రోజుల్లో ఇదే విధమైన ఛార్జింగ్ కెపాసిటీతో మరో రెండు Charging Station ను ప్రారంభించాలని Alektrify భావిస్తోంది. కాంపెనీ ప్రణాళిక ప్రకారం త్వరలోనే మరిన్ని ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల అవసరాలను తీర్చనున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేటన్ ప్రారంభోత్సవం సందర్భంగా.. నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్, బిజినెస్/ ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (NHEV) ‘అభిజిత్ సిన్హా’ మాట్లాడుతూ.. సెక్టార్-52లో Charging Station ప్రారంభించిన తర్వాత ఇది మా రెండవ ఛార్జింగ్ స్టేషన్ అని తెలిపారు. ఇది కేవలం 30 రోజుల్లోనే నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారి కోసం నోయిడాలో 60 రోజులలోపు అదే స్థాయిలో మరో రెండు Charging Station ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు / ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన తేదీ నుంచి 90 రోజుల రికార్డు సమయంలో మరో 30 ఈ-హైవే ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించనున్నామని ఆయన చెప్పారు.
Charging station ప్రత్యేకత ఏమంటే?
సాధారణ Charging Station ను అర్బన్ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తాయి. పెద్ద మొత్తంలో ఒకేసారి అంటే 1000 కార్లకు ఛార్జింగ్ చేయడం అనేది కచ్చితంగా గొప్ప విషయమే. ఇలాంటివి స్టేషన్లు రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి రావాలి. అప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ కష్టాలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది.
భారతే దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలను అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని గణనీయంగా పెంచుతాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వాలు ప్రయివేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిని బట్టి భవిష్యత్‌తో ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా అదుబాటులోకి వస్తాయి.