Home » ఇండియాలో Top 5 electric cars ఇవే..

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Spread the love

Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును ఇప్పుడు ప‌రిశీలిద్దాం.

tata nexon ev
tata nexon ev

Tata Nexon EV : 9,111 యూనిట్లు

Tata Nexon EV 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన Top 5 electric cars లో ప్రథమ స్థానంలో  నిలిచింది. CY2021లో టాటా నెక్సాన్ ఈవీ 9,111 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. టాటా Nexon EV 129 hp శక్తి, 245 Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. 30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఇది ఒక్కో ఛార్జీకి 312 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర( ఎక్స్-షోరూమ్‌) రూ.14.29 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

MG ZS Ev
MG ZS Ev

MG ZS EV: 2,798 యూనిట్లు

టాటా నెక్సాన్ తర్వాత MG ZS EV రెండో స్థానంలో నిలిచింది. CY2021లో భారతదేశంలో 2,798 యూనిట్లు విక్రయించారు. MG ZS ఎల‌క్ట్రిక్ కారులో 44.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 419 కిమీల డ్రైవింగ్ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 143 హెచ్‌పి పవర్, 353 ఎన్ఎమ్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. MG ZS EV ప్రస్తుత ధర రూ. 21.49 లక్షలు(ఎక్స్-షోరూమ్). అయితే దాని అధునీక‌రించిన వెర్షన్ మార్చి 7, 2022న భారతదేశంలో విడుద‌ల కానుంది.

tata tigor ev

టాటా టిగోర్ EV: 2,611 యూనిట్లు

Tata Motors : 2021లో Tigor EV 2,611 యూనిట్లు సేల్ అయ్యాయి. Ziptron టెక్నాలజీతో కూడిన కొత్త Tigor EV ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం గత ఏడాది ఆగస్టులో విడుద‌ల చేశారు. ఇది 26kWh లిథియం-అయాన్ బ్యాటరీ క‌లిగి ఉంటుంది. సింగిల్ ఛార్జీతో 306 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 75 hp, 170 Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. టాటా టిగోర్ EV ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.99 లక్షలుగా ఉంది.

Hyundai kona ev

Hyundai Kona Electric: 121 units

దక్షిణ కొరియా కార్‌మేకర్ హ్యుందాయ్ నుంచి త‌న హూందాయ్‌ కోనా విడుద‌ల చేశారు. 2021లో భారతదేశంలో 121 యూనిట్ల కోనా ఎలక్ట్రిక్‌ను విక్రయించగలిగింది. ఈ ఎలక్ట్రిక్ SUV 39.2kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దీని రేంజ్ 452 కి.మీ. దీని ఎలక్ట్రిక్ మోటార్ 136 హెచ్‌పి పవర్, 395 ఎన్ఎమ్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర రూ.23.79 లక్షలుగా ఉంది.

Mahindra verito

Mahindra Verito EV: 49 units

జాబితాలో మహీంద్రా వెరిటో EV చివ‌ర‌గా నిలిచింది. మహీంద్రా ఎలక్ట్రిక్ గత సంవత్సరం భారతదేశంలో 49 యూనిట్ల విక్రయించింది. కాగా ఇది ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో లేదు. మహీంద్రా వెరిటో EV 72-వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంది. ఒక్కో ఛార్జ్‌కు 110 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 41 హెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.16 లక్షలు.

5 thoughts on “ఇండియాలో Top 5 electric cars ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *