Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..

Spread the love

Indore Plantation Drive : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన న‌గ‌రం ఇండోర్ లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి స‌రికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి రేంజ్ హిల్ (Revati Range hillock ) పై మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRIలు) తో పాటు సహా 30,000 మందికి పైగా పాల్గొన్నారు.

ఇండోర్ ప్రజలతో కలిసి కేంద్ర‌ హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కూడా మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కింద ఒక మొక్కను నాటారు. మొక్క‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద‌ర్భంగా జూలై 5న ప్ర‌ధాని మోదీ ‘ఏక్ పెద్ మా కే నామ్స‌. మొక్క‌లు నాటిన విష‌యం తెలిసిందే..
దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో 5.5 కోట్లతో సహా దేశవ్యాప్తంగా 140 కోట్ల చెట్లను నాటనున్నారు. ఇందులో భాగంగానే ఇండోర్‌లో భారీ ప్లాంటేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) షూటింగ్ రేంజ్ కూడా ఉన్న కొండపై ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా, ఇండోర్ అస్సాం నిర్వహించిన ఒకే రోజులో 9.26 లక్షల మొక్కలు నాటి ప్రపంచ రికార్డును మెరుగుపరిచింది. కొత్త ప్రపంచ రికార్డును ప్రకటించే సర్టిఫికేట్‌ను ఆదివారం సాయంత్రం ఎంపీ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ, ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవతో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందం నుంచి అందుకున్నారు.

ఆదివారం ఇండోర్‌లోని బీఎస్‌ఎఫ్ రేవతి రేంజ్ సమీపంలో మొక్కలు నాటిన అనంతరం (Plantation Drive) కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అభివృద్ధి జరుగుతోందని, సౌకర్యాలు పెంచుతున్నామని, రాబోయే తరం కోసం కూడా వెనక్కి తిరిగి చూడాలని మోదీజీ కోరారు. ఎందుకంటే పర్యావరణంతోనే జీవ‌రాశుల మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉంటుంది. “కార్బన్ డై ఆక్సైడ్, కార్బ‌న్‌ మోనాక్సైడ్ పెరిగిపోయి ఓజోన్ పొర‌ను క్షీణింప‌జేశాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు మ‌నం వాతావరణ మార్పులను అనుభవిస్తున్నామ‌ని అన్నారు.

కాగా ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సింగిల్ డే ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్‌లో 30,000 మంది పాల్గొనగా, మొత్తం కార్య‌క్ర‌మాన్ని పర్యవేక్షించడానికి 100 కెమెరాలను వినియోగించారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *