Saturday, February 8Lend a hand to save the Planet
Shadow

Lectrix EV | అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే.. ఒక్కసారి చార్జ్‌పై 100కి.మీ. స్పీడ్

Spread the love

Lectrix EV | ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ (Lectrix EV) సంస్థ త‌క్కువ బడ్జెట్లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని విడుద‌ల చేసింది. ఈ స్కూటర్‌ను కేవ‌లం రూ. 49,999 (ఎక్స్‌ షోరూం)కు విక్రయిస్తోంది. అయితే మరో కొత్త విశేష‌మేమిటంటే.. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది..

లెక్ట్రిక్స్ EV అనేది ఎల‌క్ట్రిక్ వాహనాల్లో బ్యాట‌రీ స్వాపింగ్ సేవ‌ల‌ను అందిస్తున్న మొదటి OEM గా ఉంది.
2070 నాటికి జీరో కార్బ‌న్ ఫుట్ ప్రింట్ లక్ష్యానికి అనుగుణంగా, లెక్ట్రిక్స్ EV భారతదేశంలో EV స్వీకరణను వేగవంతం చేసే మార్గాలపై పని చేస్తోంది . అయితే లెక్ట్రిక్స్ EV కొత్త గా రూ. 49,999 లకే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వద్ద విడుదల చేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంట‌కు 50 కి.మీ వేగంతో ప్ర‌యాణిస్తుంది. జీవిత‌కాల బ్యాటరీ వారంటీతో వస్తుంది, తద్వారా బ్యాటరీకి సంబంధించిన ఆందోళనలు ఏవీ ఉండ‌వు..

Battery on Subscription : లెక్ట్రిక్స్‌ ఈవీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించి వినూత్నమైన యాజమాన్య విధానాన్ని తీసుకు దాని పేరు బ్యాటరీ-ఆస్-ఏ సర్వీస్ (బీఏఏఎస్) ప్రోగ్రామ్.. సాధారణంగా మీరు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన‌పుడు అందులోనే బ్యాటరీ ఉంటుంది. కానీ లెక్ట్రిక్స్‌ ఈవీ స్కూట‌ర్ లో అలా ఉండదు. వినియోగదారులు విడిగా బ్యాటరీకి సబ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వినియోగదారులకు ప్రారంభంలో పెట్టుబడిని భారీగా తగ్గిస్తుంది. అలాగే బ్యాటరీ వారంటీకి సంబంధించిన ఆందోళ‌న‌లు ఉండ‌వు. రీప్లేస్‌మెంట్ ఖర్చులకు సంబంధించిన టెన్ష‌న్ల‌ను కూడా తొలగిస్తుంది. ఈ బ్యాటరీ జీవితకాల వారంటీతో వస్తోంది. .

ఈ స్కూటర్‌ లాంచ్ ను పురస్క‌రించుకొని లెక్ట్రిక్స్‌ ఈవీ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ ప్రతీశ్‌ తల్వార్‌ మాట్లాడుతూ త‌మ బ్యాటరీ సర్వీస్‌ విధానం చాలా సింపుల్‌ గా ఉంటుందని తెలిపారు. బ్యాటరీని వాహనం నుంచి వేరు చేసి.. ప్రత్యేకమైన సర్వీస్‌గా అందిస్తామని ప్ర‌తీశ్ వివరించారు. ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. బ్యాటరీ విష‌యంలో ఖర్చుల‌ను భారీగా త‌గ్గిస్తుంద‌ని తెలిపారు. అంతేకాక ప్రస్తుత మార్కెట్లో పెట్రోల్‌ ఇంజిన్‌ ద్విచక్రవాహనం కొనుగోలు చేయాలంటే కనీసం రూ. లక్షకు పైగా పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. కానీ తమ ఎలక్ట్రిక్‌ వాహనం కేవలం రూ. 49,999‍కే అందుబాటులో ఉంద‌ని చెప్పారు. తమ సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్‌లో స్కూటర్‌ కొనడం వల్ల సగం ధరకే బండి రావడంతో పాటు నెల‌వారీ పెట్రోల్‌ ఖర్చులు కూడా తగ్గుతాయని ప్ర‌తీశ్ త‌ల్వార్ వివ‌రించారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..