ఇండియాలో మే 11న లాంచ్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో Tata Nexon EV ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారును మొదట జనవరి 2020లో ప్రారంభించారు. అయితే ఇప్పుడు త్వరలో అప్‌డేట్ వర్షన్ వస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Long range Tata Nexon EV లాంచ్ తేదీని కంపెనీ ఎట్టకేలకు ప్రకటించింది. ఇది భారతదేశంలో మే 11, 2022న ప్రారంభించడుతుంది.
కొత్త Long-range Tata NexonNexon EV లో మార్పుల విషయానికొస్తే.. పేరుకు తగినట్లుగా కొత్త Nexon EVలో అతిపెద్ద హైలైట్ దాని పెద్ద బ్యాటరీ ప్యాక్.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ టాటా ఎలక్ట్రిక్ SUV లో 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. అయితే రాబోయే మోడల్‌లో పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫాస్టెస్ట్ AC ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పుడున్న Nexon EV ఒక సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 312 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇక రాబోయే Long range Tata Nexon EV ఒకే ఛార్జ్‌పై 400 కిమీ కంటే ఎక్కువ క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు. టాటా మోటార్స్ తన EVEV యొక్క మోటార్‌ను అప్‌డేట్ చేస్తుందో లేదో ఇంకా సమాచారం లేదు. ప్రస్తుతం ఉన్న Nexon EV పవర్‌ట్రెయిన్ 129 hp శక్తిని, 245 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Long range Tata Nexon EV లో కొత్త ఫీచర్లను జత చేయవచ్చని భావిస్తున్నారు. ఇది కొత్త అల్లాయ్ వీల్స్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ESP, మరిన్ని ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, టాటా నెక్సాన్ EV ధర రూ. 14.54 లక్షల నుంచి రూ. 17.15 లక్షల (ఎక్స్-షోరూమ్ )వరకు ఉంది. రాబోయే లాంగ్-రేంజ్ వెర్షన్ ప్రస్తుత Nexon EV కంటే రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షల వరకు అదనంగా ధర ఉండచ్చని తెలుస్తోంది.