Harithamithra Telugu News

Home EV Updates ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో...

ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!

0
tata-punch-ev-facelift-india-launch-feb-2026

Tata Punch EV Facelift Launch India | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV (Tata Punch EV) ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వ‌స్తోంది. టాటా మోటార్స్ తన పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాటామోటార్స్‌ ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ఐసిఈ (ICE – పెట్రోల్) పంచ్ ఫేస్‌లిఫ్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పడింది.

ఏమిటి కొత్తదనం? (Cosmetic Changes)

పంచ్ EV ఇప్పటికే టాటా ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఈ మిడ్-సైకిల్ అప్‌డేట్‌లో కొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండబోతున్నాయి:
ఎక్స్‌టీరియర్: ఐసిఈ వెర్షన్ తరహాలోనే కొత్త అల్లాయ్ వీల్స్, ‘కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్’ (Connected LED Tail Lamps) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
కలర్ ఆప్షన్స్: మార్కెట్లో క్రేజ్ పెంచడానికి సరికొత్త రంగులు, స్పెషల్ ఎడిషన్లను టాటా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఫీచర్లు ఇంటీరియర్ (Features & Cabin)

ప్రస్తుతం ఉన్న హై-టెక్ ఫీచర్లను ఈ మోడల్ కూడా నిలుపుకోనుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ టోన్ క్యాబిన్ థీమ్ డాష్‌బోర్డ్ ను చూడ‌వ‌చ్చు.

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత కీలకమైన మార్పు లెవల్ 2 ADAS (Advanced Driver Assistance Systems) సూట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీంతో ఇది పంచ్ EVని టాటా యొక్క ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల సరసన చేరుతుంది.

రేంజ్- బ్యాటరీ (Performance)

పవర్‌ట్రెయిన్ సెటప్‌లో మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న రెండు బ్యాటరీ ఆప్షన్లే కొనసాగే అవకాశం ఉంది:

  • 25kWh బ్యాటరీ: సుమారు 315 కి.మీల రేంజ్ (MIDC).
  • 35kWh బ్యాటరీ: సుమారు 421 కి.మీల రేంజ్ (MIDC).

మార్కెట్ పోటీ : ఈ అప్‌డేటెడ్ పంచ్ EV మార్కెట్లో ఉన్న‌ సిట్రోయెన్ eC3 మరియు MG కామెట్ EV లకు గట్టి పోటీని ఇవ్వనుంది. అంతేకాకుండా, త్వరలో విడుదల కానున్న విన్ఫాస్ట్ VF 3 తో కూడా ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది.

ప్రస్తుత పంచ్ EV ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లతోపాటు ADAS టెక్నాలజీ జోడించినందున టాటా పంచ్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, దేశంలోనే అత్యంత అందుబాటులో ఉన్న ‘ఫీచర్-రిచ్’ ఎలక్ట్రిక్ SUVగా ఇది తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది.

Previous articleసోనాలి కోళ్ల పెంపకం: నాటు కోడి రుచి.. లేయర్ కోడి దిగుబడి.. రైతులకు లాభాల సిరి!
Next articleరైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here