Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వరలో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది.
కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడక్ట్. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది డ్రైవింగ్ పరిధిని పెంచడానికి అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టం, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
Tata Ace EV సాధారణ, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. ఇందులో 27kW (36hp) మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది 130Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అత్యధిక కార్గో వాల్యూమ్ 208 ft3, గ్రేడ్-ఎబిలిటీ 22% పూర్తి లోడ్ చేయబడిన పరిస్థితుల్లో సులభంగా పైకి వెళ్లేలా చేస్తుంది. Ace EV యొక్క కంటైనర్ తేలికైన, మన్నికైన మెటల్‌తో తయారు చేయబడింది. ఇది ఇ-కామర్స్ లాజిస్టిక్స్ అవసరాలకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది.
Tata Ace EV లాంచ్‌పై టాటా సన్స్/ టాటా మోటార్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. “ఈ-మొబిలిటీకి సమయం ఆసన్నమైంది. Tata Motors లో ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల తోపాటు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లలో ఈ మార్పుకు నాయకత్వం వహించడానికి తాము వేగంగా దూసుకెళ్తున్నామని తెలిపారు. Ace EV లాంచ్‌తో మేము ఈ-కార్గో మొబిలిటీ యొక్క కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.
Tata Ace (టాటా ఏస్) భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన వాణిజ్య వాహనం. ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వాణిజ్య వాహనాల విద్యుదీకరణపై ఆనందంగా ఉందని తెలిపారు.
Tata Motors ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు మరియు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లు – Amazon, BigBasket, City Link, DOT, Flipkart, LetsTransport, MoEVing మరియు Yelo EV వంటి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ “భారతదేశంలో జీరో-ఎమిషన్ కార్గో మొబిలిటీని అందించే మా ప్రయాణంలో Ace EV ప్రవేశం ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. మా ఇ-కామర్స్ కస్టమర్ల నుండి భారీగా మద్దతు లభించిందని తెలిపారు. అందుకే వారితో మేము జీరో-ఎమిషన్ కార్గో మొబిలిటీ యొక్క ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు.
Good