Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

త్వరలో మరికొన్ని Mahindra electric cars

Spread the love
Mahindra electric car
Mahindra electric car

Mahindra electric cars : భార‌తీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా త్వ‌ర‌లో మరికొన్ని ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ధ్ద‌మ‌వుతోంది. జూలైలో స‌రికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామ‌ని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. EV రోడ్‌మ్యాప్‌ను ప్రకటించే ముందు, ఈ సంస్థ మూడు EV కాన్సెప్ట్ మోడల్‌లను టీజ్ చేసింది, అయితే ఇవ‌న్నీ SUVలుగా క‌నిపిస్తున్నాయి. మహీంద్రా మూడు కార్లను ప్రదర్శిస్తూ టీజర్ వీడియోను షేర్ చేసింది.

రాబోయే Mahindra electric cars బోర్న్ ఎలక్ట్రిక్ విజన్‌లో భాగంగా ప్రదర్శించబడ్డాయి. ఇది దాని మొత్తం EV పోర్ట్‌ఫోలియోను అందించే కొత్త ప్లాట్‌ఫారమ్. ఈ కాన్సెప్ట్ వాహనాలను రూపొందించడం వెనుక ప్రతాప్ బోస్ కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న కొత్త తరం టాటా మోటార్స్ కార్ల రూపాన్ని మార్చడంలో కృషి చేశారు. UKలోని కార్‌మేకర్.. యూరోప్ (MADE) స్టూడియోలో మహీంద్రా EV కాన్సెప్ట్ కార్ల‌ను అభివృద్ధి చేయబోతున్నాయి.

మ‌హింద్ర కంపెనీకి చెందిన ప్రసిద్ధ XUV300 SUV యొక్క పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో దాని ICE పోర్ట్‌ఫోలియోలోని నాలుగు SUVలను ఎలక్ట్రిక్ కార్లుగా మారుస్తామని తెలిపింది. అందులో XUV300 కాగా, టీజర్ వీడియోలో ప్రదర్శించబడిన మిగిలిన మూడు XUV700, KUV100, బొలెరో లేదా స్కార్పియో అయి ఉంటుంది. కొత్త EV కాన్సెప్ట్‌ల గురించి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *