Maruti Fronx Hybrid: డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు, CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది. 2020 ఏప్రిల్ లో డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, మారుతి పెట్రోల్, CNG పోర్ట్‌ఫోలియోపై ఎక్కువగా దృష్టిసారించింది. కంపెనీ నుంచి చాలా CNG కార్లు వచ్చాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ విభాగంలో మారుతి కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ SUV మారుతి eVX ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో పాటు, మారుతి సుజుకీ.. హైబ్రిడ్ విభాగంలో కూడా పైచేయి సాధించాలన చూస్తోంది.
Autocar నివేదిక ప్రకారం.. అన్నీ సస్యంగా జరిగితే 2025 నాటికి మారుతి సుజుకి తన చౌకైన SUV మారుతి FRONX హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేస్తుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ-మెయింటెనెన్స్ కారణంగా మారుతి సుజుకి మిగతా కంపెనీల కంటే అగ్రస్థానంలో ఉంటుంది. . అయితే, గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియో మార్కెట్ లో వేగం పెంచింది. ఇప్పటి వరకు, భారీ డీజిల్, లోహలట్ వాహనాలకు పాపులర్ అయిన టాటా మోటార్స్, ఎలక్ట్రిక్ వాహన విపణిలో దేశంలో మిగతా వాటికి అందనంత దూరంలో దూసుకెళ్తూ.. నెంబర్ వన్ గా నిలిచింది. CNGలోకి కూడా బలమైన ప్రవేశం చేసింది. అంతేకుండా సీఎన్జీ విభాగంలో ఆటోమెటిక్ వెర్షన్ విడుదల చేసి సవాల్ విసిరింది.
పెట్రోల్-CNG కంటే ఎక్కువ ఫీచర్స్..
హైబ్రిడ్ వాహనాలకు సంబంధించి మారుతీ సుజుకీ బలమైన గేమ్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. హైబ్రిడ్ కార్లు భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా ఎలక్ట్రిక్ కార్ల కంటే పైచేయి సాధించాయి . దీనికి మారుతి సుజుకి, టయోటా లే కీలక పాత్ర పోషించాయి. ఎలక్ట్రిక్ రేసులో చేరడానికి బదులుగా, ఇవి హైబ్రిడ్, ఇతర పవర్‌ట్రెయిన్‌లపై దృష్టి సారించాయి . మారుతి మో కూడా మల్టీ ఫ్యూయల్ పై పనిచేస్తోంది. ఇటీవల కంపెనీ బయోగ్యాస్‌తో నడిచే వ్యాగన్ R CBG, బ్రెజ్జా CBG కాన్సెప్ట్‌లను కూడా ఆవిష్కరించింది అందరన్నీ అబ్బురపరిచింది. ఫోర్డ్, స్విఫ్ట్, బాలెనో, కంపాక్ట్ MPP వంటి కొన్ని మోడళ్లను హైబ్రిడ్ వేరియంట్లలో విడుదల చేయడానికి కంపెనీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైబ్రిడ్ సిస్టమ్ ..
మారుతీ సుజుకీ కార్లలో సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. ఈ సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు కోడ్ పేరు (HEV) పెట్టారు. ఇది పొదుపుగా, చాలా చౌకగా ఉంటుందని భావిస్తున్నారు. సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్‌లలో పెట్రోల్ ఇంజిన్ జనరేటర్ లేదా రేంజ్ ఎక్స్‌టెండర్ గా మాత్రమే పని చేస్తుంది. కాబట్టి నేరుగా వాహనాన్ని నడపడానికి బదులుగా.. ఇది చక్రాలను నడిపే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని ఇస్తుంది.
దీని వల్ల ఎలక్ట్రిక్ మోటారు చక్రాలను నడిపే శక్తి మూలం కాబట్టి ఇది చాలా సులభం. EV మాదిరిగా – మోటారు చిన్న బ్యాటరీ ప్యాక్ లేదా పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే జనరేటర్ నుంచి విద్యుత్ ను తీసుకుంటుంది. సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్‌లను రేంజ్ ఎక్స్‌టెండర్ హైబ్రిడ్‌లు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ICE ఇంజిన్ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ప్యాక్‌ను రీఛార్జ్ చేయడానికి జనరేటర్ గా పనిచేస్తుంది.
మారుతి సుజుకి HEV-ఆధారిత సిరీస్ శ్రేణి లో కొత్త Z12E, మూడు-సిలిండర్ ఇంజన్ ఉంటుంది.. ఈ ఇంజన్ 1.5-2kWh బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసే జెనరేటర్ మాదిరిగా పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ముందు భాగంలో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ ను అందిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్‌ను తిప్పి కారును ముందుకు కదిలిస్తుంది. ఈ సాధారణ యంత్రాంగం ఈ హైబ్రిడ్ వ్యవస్థకు ఆధారం.. కంపెనీ దీనిని సమీప భవిష్యత్తులో తన ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో ఉపయోగించనుంది.
Hybrid Cars 40 కిలోమీటర్ల మైలేజీ..
సిరీస్ హైబ్రిడ్‌లో ఇంజిన్ శక్తిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే నడుస్తుంది. డ్రైవింగ్ లోడ్‌ను నేరుగా తీసుకొనదు. కాబట్టి, ఇది తరచుగా ప్రధాన ఇంధన-సమర్థవంతమైన రెవ్ రేంజ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల మారుతి HEV- Hybrid Cars లో ఇంధన వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ కార్లు లీటర్ కు సుమారు 35-40 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని సమాచారం.. అయితే, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.