Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

Spread the love

Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది.

రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ “ఈ వృద్ధి మాలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మా దృష్టికి బాలన్నిస్తుంది.  ఈ కొత్త డీలర్‌షిప్‌లు తీసుకువచ్చే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాము. అర్బన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మేము కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాము.” అని తెలిపారు.

కొత్తగా ప్రారంభించబడిన ఈ Revolt Motors dealership లు ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటాయి. కస్టమర్‌లు అత్యాధునిక బైక్‌లను అన్వేషించడానికి, పరిశీలించడానికి వీలుంటుంది. అంతేకాకుండా కొనుగోలు చేసేముందు బైక్ లను టెస్ట్ రైడ్ చేయడానికి సౌకర్యవంతమైన వాతావరణం ఈ డీలర్ షిప్ సెంటర్లలో ఉంటుంది.  డీలర్‌షిప్‌లు విక్రయాలు, అమ్మకాల తర్వాత సపోర్ట్,  జన్యూన్ పార్ట్స్,   సాంకేతిక సహాయంతో సహా అనేక రకాల సేవలను ఈ సెంటర్లు అందిస్తాయి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *