రికార్డుస్థాయిలో MG Motor వాహ‌నాల విక్ర‌యాలు

Spread the love

మార్చి- 2023లో 6051 యూనిట్ల సేల్స్‌..

MG Motor highest sales : MG మోటార్ ఇండియా 2023 మార్చిఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మార్చిలో 6051 యూనిట్ల రిటైల్ విక్రయాలు జ‌రిగిన‌ట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 28% వృద్ధి న‌మోదు చేసుకుంది. నెలవారీ యూనిట్ విక్రయాల పరంగా MG ఇండియాకి ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్‌. ఈ విజ‌యం సమీప భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఇంకా మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది. MG Motor highest sales

MG మోటార్ ఇండియా సీనియర్ డైరెక్టర్ – సేల్స్, రాకేష్ సిదానా ప్రకారం, “నెక్స్ట్-జెన్ MG హెక్టర్, భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ SUV కు మార్కెట్లో విప‌రీత‌మైన డిమాండ్ ఉంద‌ని తెలిపారు. దీనిని ప్రారంభించినప్పటి నుండి ఈ నెలలో దాని రెండవ అత్యధిక లైఫ్‌టైం విక్రయాలను నమోదు చేసింది. అదేవిధంగా MG ZS EV భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV, మార్కెట్ విభాగాలలో మంచి ట్రాక్షన్‌ను నమోదు చేస్తోంది. మ‌రోవైపు ఎంజీ మోటార్ ఇండియా త్వ‌ర‌లో స్మార్ట్ EV అయిన MG Comet EV ని లంచ్ చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..