2026 Bajaj Chetak C25 : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన బజాజ్ ఆటో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తన సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘చేతక్ C25 01’ పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్, చేతక్ లైనప్‌లోనే అత్యంత సరసమైన స్కూటర్‌గా నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను ₹91,399 గా కంపెనీ నిర్ణయించింది.
మార్కెట్‌లో చేతక్ హవా:
2021లో ప్రారంభమైనప్పటి నుండి బజాజ్ చేతక్ దాదాపు 2.80 లక్షల యూనిట్ల విక్రయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో బజాజ్ 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటం విశేషం. ఈ ఊపును కొనసాగించేందుకు కంపెనీ మరిన్ని ఫీచర్లతో తక్కువ ధరలో ఈ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది.
డిజైన్, కొత్త ఫీచర్లు:
- కొత్త చేతక్ C25 01లో పాత మోడల్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే కొన్ని కీలక మార్పులు చేశారు:
- హెడ్‌ల్యాంప్: ఐకానిక్ హార్స్‌షూ ఆకారపు LED DRLతో కూడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్.
- ఇండికేటర్లు: గతంలో ఆప్రాన్ ప్యానెల్‌పై ఉన్న టర్న్ ఇండికేటర్లను ఇప్పుడు హ్యాండిల్ బార్‌కు మార్చారు.
- సీటు: 650 mm పొడవు, 763 mm ఎత్తుతో పునఃరూపకల్పన చేసిన సౌకర్యవంతమైన సీటు.
- స్టోరేజ్: సీటు కింద 25 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్.
- డిస్‌ప్లే: ధర తగ్గించే క్రమంలో ప్రీమియం మోడల్స్‌లోని TFT యూనిట్ స్థానంలో రివర్స్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారు.
టెక్నాలజీ & కనెక్టివిటీ:
తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్లలో బజాజ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లేబ్యాక్, USB ఛార్జింగ్ పోర్ట్ మరియు రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాంప్రదాయ కీ స్లాట్ మరియు ఓపెన్ గ్లోవ్ కంపార్ట్‌మెంట్ అదనపు ఆకర్షణలు.
- బ్యాటరీ – పర్ఫార్మెన్స్:
బ్యాటరీ: 2.5 kWh NMC బ్యాటరీతో వస్తుంది. - రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కి.మీ (IDC) ప్రయాణించవచ్చు.
- ఛార్జింగ్: 750W ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో కేవలం 2 గంటల 25 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
- మోటార్: 2.2 kW హబ్-మౌంటెడ్ మోటార్.
- స్పీడ్: గంటకు గరిష్టంగా 55 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
- మోడ్స్: ఎకో (Eco) మరియు స్పోర్ట్ (Sport) అనే రెండు రైడ్ మోడ్స్ కలవు.
బ్రేకింగ్, సస్పెన్షన్ : ప్రయాణ సౌలభ్యం కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. భద్రత కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు. కొత్త చేతక్ C25 01 కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలోనే దశలవారీగా ప్రారంభం కానున్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..


