
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీ
Mulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, మంత్రి సీతక్క, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాలో పామాయిల్ పంట సాగు చేయడమే కాకుండా హార్టికల్చర్, సెరికల్చర్ ద్వారా రైతులకు ఆదాయం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉతమ్మల పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేయాలని, అలాగే రసీదులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..