Harithamithra Telugu News

Home EV Updates E-scooters EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు...

EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?

0
Hero Vida VX2

భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి.

ధరలు & వేరియంట్లు ఇలా:

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే కొనుగోలు చేయవచ్చు. ఇక Plus వేరియంట్ ₹1,09,990 (బ్యాటరీతో), లేదా ₹64,990 (BaaS)గా ఉంది.

మరోవైపు, ఓలా S1 Z రెండు ఎంపికల్లో వస్తోంది అందులో మొదటిది స్టాండర్డ్ (₹59,999) రెండోది Z+ (₹64,999). స్టాండర్డ్ వేరియంట్‌లో 1.5kWh రిమూవల్ బ్యాటరీ లభిస్తుంది. Z+ వేరియంట్‌కి పెద్ద డిస్‌ప్లే, అదనపు ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, పరిధి, ఛార్జింగ్ – ఏది బెస్ట్ ?

హీరో విడా GO మోడల్ 2.2kWh బ్యాటరీతో 92 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. Plus వేరియంట్‌కి రెండు బ్యాటరీలు ఉండడంతో సింగిల్ చార్జిపై 142 కిమీ ప్రయాణిస్తుంది. వీటిలోని బ్యాటరీలను ఇంటి వద్దే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే BaaS పథకం ద్వారా మార్పిడి చేసుకోవచ్చు.

ఓలా S1 Z మోడల్ ఒక 1.5kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. రెండవ బ్యాటరీ కలిపితే రేంజ్ 146 కిమీ వరకు పెరుగుతుంది. ఛార్జింగ్‌కి ఓలా హైపర్‌నెట్‌వర్క్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

సాంకేతికత మరియు లక్షణాలు

ఫీచర్హీరో విడా VX2 ప్లస్ఓలా S1 Z / Z+
డిస్ల్పే4.3-అంగుళాల TFT12-అంగుళాలు (Z) /
14-అంగుళాల (Z+) LCD
నావిగేషన్ & మీడియాపరిమితంస్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా లభిస్తుంది
OTA అప్‌డేట్‌లు & యాప్ సపోర్ట్
స్టాండర్డ్
యాప్ ఇంటిగ్రేషన్‌తో విస్తృతమైన ఫీచర్లు

ఫీచర్లు ఎవరిది ఎక్కువ?

Hero Vida VX2 బేసిక్ కాన్సోల్, స్టాండర్డ్ కనెక్టివిటీతో వస్తుంది. కస్టమర్లకు BaaS స్కీమ్ ద్వారా ఖర్చును తగ్గించుకునే సౌలభ్యం ఉంది. ఓలా S1 Z Z+ వేరియంట్ పెద్ద డిస్‌ప్లే, మ్యూజిక్ ప్లేయర్, నావిగేషన్, ఓటీఏ అప్‌డేట్లను అందిస్తుంది.

మోడల్బ్యాటరీ సెటప్పరిధిఅత్యధిక వేగం0–40 కి.మీ/గం త్వరణం
హీరో విడా VX2 గో2.2 kWh92 కి.మీగంటకు 70 కి.మీ.4.2 సెకన్లు
హీరో విడా VX2 ప్లస్3.4 kWh ( డ్యూయల్)142 కి.మీగంటకు 80 కి.మీ.3.1 సెకన్లు
ఓలా S1 Z (1 బ్యాటరీ)1.5 kWh75 కి.మీగంటకు 70 కి.మీ.~4.7 సెకన్లు
ఓలా S1 Z (2 బ్యాటరీలు)3 kWh146 కి.మీగంటకు 70 కి.మీ.~4.7 సెకన్లు

రెండింటిలో ఏది ఉత్తమం ?

  • తక్కువ ధరలో ఈవీ స్కూటర్ కావాలనుకునేవారికి – Ola S1 Z స్టాండర్డ్
  • ఎక్కువ రేంజ్, ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవారికి – Hero Vida VX2 Plus
  • ఫీచర్లను ప్రాధాన్యంగా చూస్తే – Ola S1 Z+

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Previous articleAther Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..
Next articleMulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here