Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొదటిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధరలు వరుసగా రూ. 1,19,999, రూ. 1,29,999, అసలు ధరపై రూ. 20,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.
దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తృతంగా వ్యాప్తి చేయాన్న లక్ష్యంతో ఈ డిజిటల్ సేల్స్ ను ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రారంభించింది. అమెజాన్‌తో ఈ బ్రాండ్ విస్తృత ప్రాంతాల్లో కొనుగోలుకు వీలు కల్పిస్తుంది. ఈ విషయమై ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు & CEO మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ, “అమెజాన్ (Amazon)లో రోర్ EZని అందుబాటులోకి తీసుకురావడం అనేది భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న కొనుగోలు తీరుకు అనుగుణంగా ఒక వ్యూహాత్మక చర్య అని అన్నారు. వినియోగదారులు ప్రధాన కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నందున, వారిని చేరుకోవడానికి ఇ-కామర్స్ మాకు ప్రత్యక్ష విశ్వసనీయ ఛానెల్‌ను అందిస్తుంది.” అని తెలిపారు.

ఒబెన్ ARX ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ., 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 175 కి.మీ వరకు IDC-సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఈ మోటార్ సైకిల్ ఒబెన్ సొంతంగా అభివృద్ధి చేసిన LFP బ్యాటరీ టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది బ్యాటరీ జీవితాన్ని రెండింతలు, 50% ఎక్కువ ఉష్ణ నిరోధకత, భారతీయ రోడ్లు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాస్తవ ప్రపంచంలో విశ్వసనీయతను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. రోర్ EZ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (UBA), డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్ (DAS) వంటి రైడర్ సహాయాలను కూడా కలిగి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.



