Home » Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

Spread the love

దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా
అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ 

● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ
● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు
● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్
నవంబర్ 10 నుంచి అన్ని ఓలా స్కూటర్‌లపై రూ.2,000 అదనపు తగ్గింపు

బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ భారత్ EV ఫెస్ట్‌ (Ola Bharat Ev Fest) లో భాగంగా గురువారం అద్భుతమైన దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, వారంటీ, లాభదాయకమైన ఫైనాన్సింగ్ డీల్స్ ఇందులో ఉన్నాయి. నవంబర్ 10 నుంచి అన్ని స్కూటర్ల పై అదనంగా రూ.2,000 సహా రూ.26,500 వరకు విలువైన ఆఫర్‌లను కస్టమర్‌లు ఇప్పుడు పొందవచ్చు.
ఓలా S1 Pro Gen-2 కొనుగోలు పై కస్టమర్‌లు ఇప్పుడు రూ.7,000 విలువైన ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీని పొందవచ్చు.
ఓలా S1 Air ఓలా S1 X+ కొనుగోలుపై ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.
S1 Pro Gen-2ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇప్పుడు కేవలం రూ.2,000 చెల్లించడం ద్వారా కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీకి (రూ. 9,000 విలువ) అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.
కస్టమర్‌లు తమ పాత ICE 2W (పెట్రోల్ ద్విచక్రవాహనం)ని మార్చుకొని S1 Pro Gen-2 కొనుగోలుపై గరిష్టంగా రూ.10,000 వరకు, అలాగే ఓలా S1 Air ఓలా S1 X+ కొనుగోలుపై రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
కొనుగోలుదారులు తమ సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఫైనాన్స్ ఆఫర్లు

కొనుగోలుదారులు కొన్ని క్రెడిట్ కార్డ్ EMIలపై రూ.7,500 వరకు తగ్గింపులను పొందవచ్చు. అయితే ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 5.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆఫర్లు దీపావళి వరకు వర్తిస్తాయి.

లక్కీ-బూట్ ఆఫర్‌లు

కస్టమర్‌లు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడ్ చేయవచ్చు. అలాగే ప్రతిరోజూ S1X+ గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాకుండా, ఉచిత ఓలా మర్చండైస్, Ola Care+ డిస్కౌంట్ కూపన్‌లు, ఓలా S1 ప్రో (జెన్ 2) కొనుగోలు పై రూ.1,000 వరకు విలువైన డిస్కౌంట్ కూపన్స్ పొందవచ్చు.
గత వారం రూ 1,47,499 ధరతో, S1 Pro (2వ జనరేషన్ ) డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి, అదేవిధంగా, S1 ఎయిర్ ₹1,19,999 కి అందుబాటులో ఉంది.
ఓలా ఎలెక్ట్రిక్ అదనంగా విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి ICE-కిల్లర్ ప్రాడక్ట్ S1Xని మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. అవి
S1 X+,
S1 X (2kWh),
S1 X (3kWh) .
S1 X+ ఇప్పుడు రూ ₹1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
S1 X (3kWh), S1 X (2kWh) కోసం ప్రీ-రిజర్వేషన్ విండో ఇప్పుడు రూ 999 తో తెరవబడింది.
S1 X (3kWh), S1 X (2kWh) స్కూటర్‌లు రూ 99,999, రూ 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *