మొదటి రోజు రూ.600 కోట్లు
Ola Electric : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 15న బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్షన్ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో ప్రతీ సెకనుకు నాలుగు స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు అక్టోబర్ నెలలో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
Ola Scooter పై వినియోగదారుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతీ సెకనుకు నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లకు బుకింగ్స్ పొందుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
స్కూటర్లు అయిపోయే లోపు బుకింగ్ చేసుకోవాలని ఆయన కోరారు. మొదటి రోజు విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విలువ (రూ. 600 కోట్లు) అని పేర్కొన్నారు. అయితే ద్విచక్ర వాహన పరిశ్రమ ఒక రోజులో విక్రయించే దానికంటే ఇది ఎక్కువ అని ఆయన తెలిపారు.
ఆసక్తి గల కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా Ola S1, Ola S1 Pro స్కూటర్లను రూ.20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందస్తుగా వారు తమ Ola S1 లేదా Ola S1 Pro రవాణా చేయడానికి ముందు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ అక్టోబర్‌లో షెడ్యూల్ చేయబడింది. తమ ఓలా ఎస్ 1 లేదా ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న కస్టమర్లు షిప్పింగ్‌కు ముందు ఎప్పుడైనా తమ బుకింగ్‌లను రద్దు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Ola S1, Ola S1 Pro ప్రో ధర, స్పెసిఫికేషన్‌లు
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో అందించబడింది. ఓలా S1 లో 2.98kWhr బ్యాటరీ, ఓలా S1 ప్రోలో 3.97kWhr బ్యాటరీని వినియోగించారు. ఓలా ఎస్ 1 ధర (ఎక్స్-షోరూమ్) 99,999. ఓలా ఎస్ 1 ప్రో ధర(ఎక్స్-షోరూమ్) రూ.1,29,999 కి కొనుగోలు చేయవచ్చు.
121కి.మి రేంజ్, 90కి.మి స్పీడ్
Ola Electric ఎస్ 1 ఈ-స్కూటర్ 121 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఓలా ఎస్ 1 ప్రో 181 కిమీ రేంజ్ ని ఇస్తుంది. దీని టాప్ ప్పీడ్ 115 కిలోమీటర్లు. ఓలా ఎస్ 1 నార్మల్, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉండగా, ఓలా ఎస్ 1 ప్రో నార్మల్, స్పోర్ట్స్ తోపాటు హైపర్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.
7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
Ola S1, Ola S1 Pro లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. AI స్పీచ్ రికగ్నిషన్ అల్గోరిథం ఉన్నాయి. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, జియో-ఫెన్సింగ్, ఫ్లేమ్-రిటార్డెంట్ బ్యాటరీ ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో రెండింటిలోనూ ఉంటాయి.
Nice