హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
1 min read

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

Spread the love

దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers

ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో అలాగే మెహదీపట్నంలో రేతిబౌలిలో  Ola experience centers ను ప్రారంభించింది. దీంతో, హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ వాహనాల కొనుగోలు ప్రక్రియ ను మరింత సులభతరం చేసేందుకు , మేము దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మా ఆఫ్‌లైన్ ఉనికిని దూకుడుగా విస్తరిస్తున్నాము. మేము మా ఆఫ్‌లైన్ సెంటర్స్ ను విస్తరించే చర్యలను వేగవంతం  చేయవలసిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాము. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న లక్షలాది భారతీయులు మా ఉత్పత్తులు, సేవలను సజావుగా అందించడానికి వీలు కల్పిస్తాము’’ అని వివరించారు.

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు  వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. దాదాపు 90% మంది ఓలా వినియోగదారులు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే, కొనుగోలు ప్రక్రియలో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. వినియోగదారులు స్టోర్‌లలో ఫైనాన్సింగ్ ఆప్షన్స్ గురించిన సమాచారాన్ని పొందడంతో పాటు, ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలు ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు.

భారతదేశంలో 2025 నాటికి మొత్తం 2వీలర్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలనే దృక్పథంతో ముందుకు సాగుతోంది., స్థిరమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచ మార్పును వేగవంతం చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం దృఢమైన ప్రణాళికను అమలు చేస్తోంది.


tech news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *