ప్రముఖ EV తయారీదారు Ola Electric.. తన Ola S1 Pro కొనుగోలు కోసం పర్చెస్ విండోను హోలీ రోజున అంటే మార్చి 17 మరియు 18 తేదీలలో ఓపెన్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్ కలర్ ‘గెరువా’ని కూడా అందిస్తోంది. అయితే ఇది రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వేషన్‌లను కలిగి ఉన్న కస్టమర్లు 17న కొనుగోలు చేయడానికి ముందస్తు యాక్సెస్‌కు అర్హులవుతారు. ఇతరులు మార్చి 18న కొనుగోలు చేయవచ్చు.
కస్టమర్‌లు ola S1 Pro లోని ఇతర పది రంగుల్లో దేనినైనా కొనుగోలు చేయవచ్చు. మొదటి కొనుగోలు విండో మాదిరిగానే, పూర్తిగా డిజిటల్ చెల్లింపు ప్రక్రియ Ola యాప్ ద్వారా మాత్రమే ఉంటుంది. డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లు కూడా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి.
“అధిక కస్టమర్ డిమాండు”కు అనుగుణంగా ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ఉత్పత్తి, డెలివరీలను ” పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2020లో ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు ప్రభుత్వంతో తన మొదటి ఫ్యాక్టరీని స్థాపించడానికి ₹2,400 కోట్ల పెట్టుబడి కోసం ఎంఓయుపై సంతకం చేసింది. పూర్తయిన తర్వాత, ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీఫ్యూచర్‌ఫ్యాక్టరీ దాదాపు 10,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని, అలాగే 2 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Ola s1 Pro కు భారీ డిమాండ్
సెప్టెంబరు 2021లో, కంపెనీ తన మొదటి కొనుగోలు విండోను తెరిచిన రెండు రోజుల్లో ₹1,100 కోట్లకు పైగా అమ్మకాలను చేపట్టినట్లు నివేదించింది. జనవరి 2022లో, Ola Electric Tekne ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, Edelweiss మరియు ఇతరుల నుండి $5 బిలియన్ల విలువతో $200 మిలియన్లకు పైగా పెట్టుబడులను సేకరించింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబందించిన అప్డేట్స్, రివ్యూస్ కోసం హరితమిత్ర యూట్యూబ్ చానల్ ని సందర్శించండి.
Waiting for this scooter