జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం
జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే..
బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి.. జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే వారికి రు. 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇతర కస్టమర్‌లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి రు. 1,19,999 కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. వాహనాలు ఆగస్టులో డెలివరీలు ప్రారంభమవుతాయి.
టాప్ స్పీడ్ గంటకు 90km.. రేంజ్ 125km
Ola S1 ఎయిర్ electric scooter భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ఘననీయంగా పెంచే ఒక ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానియన్. అతితక్కువ రన్నింగ్ మెయింటెనెన్స్ ఖర్చులతో, S1, S1 ప్రో మోడళ్ల తర్వాత అదే అత్యాధునిక సాంకేతికత, డిజైన్ తో S1 ఎయిర్ మోడల్ తక్కువ ధరలో వచింది.. 3kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీల సర్టిఫైడ్ రేంజ్, 90 కిమీ/గం టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.
కంపెనీ ఏం చెబుతోంది..?
తాజా ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఓలా ప్రతినిధి ఇలా అన్నారు: “S1 ఎయిర్‌తో మా లక్ష్యం ఎల్లప్పుడూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే. S1 మరియు S1 ప్రోల విజయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రధాన స్రవంతిలోకి మార్చింది. S1 ఎయిర్ రాక త్వరలో భారతదేశ స్కూటర్ పరిశ్రమలో ICE యుగానికి ముగింపు పలకనుందని మేము విశ్వసిస్తున్నాము.”
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేశాము. కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది ఆగస్టు నాటికి 1,000 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది. సుమారు 90% మంది కష్టమర్లు అలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు 20 కిలోమీటర్ల లోపలే ఉండడం విశేషం. అని తెలిపారు.
స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ టెక్నాలజీ, అసమానమైన పనితీరు కలిగిన S1 ప్రో, S1, మరియు S1 ఎయిర్‌లతో కూడిన S1 లైనప్ సొగసైన, మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలకు పైగా 2W EV విభాగంలో అమ్మకాల చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.