పండుగ సీజన్‌లో ప్రారంభం
గంటకు 45 km/h వేగం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల
Omega Seiki మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (OSM) ఇటీవల తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఈ మోడళ్ల పేర్లు జోరో మరియు ఫియారే. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బుకింగ్‌లు 2021 ఆగష్టు నెలాఖరుకు ప్రారంభమవుతాయి. ఇవి పండుగ సీజన్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. Omega Seiki సంస్థ తన కొత్త ఉత్పత్తులను పూణేలోని కొత్త ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లో ఇటీవల ప్రదర్శించింది. OSM ఎలక్ట్రిక్ వాహనాలు జోరో అలాగే ఫియారే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి గంటకు 45 km/h వేగంతో వెళ్తాయి. ఈ వాహనాలు ఏడు రంగులలో అందుబాటులో ఉంటాయి.
ఈ ఏడాది చివరినాటికి 115 షోరూంలు
ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ.. తాము B2B సెక్టార్ కోసం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్యేక అప్లికేషన్లు, ఫీచర్లను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్ సెక్టార్ మరియు ఇతర రంగాలలో కీలక పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. తమ మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను పూణేలో ప్రారంభించామని, ఒమేగా సీకి మొబిలిటీకి దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 15 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే 2021 చివరి నాటికి 115 షోరూమ్‌లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించుకున్నామని ఉదయ్ నారంగ్ తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో 10 ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లను కూడా ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు.
భారతదేశంలోని ప్రధాన పట్టణాలు మరియు నగరాలలో షోరూంలను విస్తరించే వ్యూహానికి అనుగుణంగా, ఒమేగా సీకి మొబిలిటీ తన మొదటి ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను పూణేలో ప్రారంభించింది. ఒమేగా సీకి మొబిలిటీ ఫ్లాగ్‌షిప్ షోరూమ్ ముఖ్యంగా టెక్ గాడ్జెట్‌లు (టాబ్లెట్‌లు) కలిగిన ఇంటరాక్టివ్ స్పేస్. ఇది వాహనం మరియు దాని ఫీచర్ల గురించి తెలుసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది.
2 thoughts on “Omega Seiki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు”