Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Spread the love

PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన‌ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక‌సాయం అందిస్తోంది. ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంది. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో విడుదల చేయబడుతుంది. ఒక్కో విడత కింద రూ.2వేలు రైతుల ఖాతాలకు పంపుతారు. ఇటీవల, ఫిబ్రవరి 28న మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

PM-Kisan 17th installment : ఇక 17వ విడత  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 17వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. నివేదికల ప్రకారం, PM-కిసాన్ పథకం 17వ విడత మే చివరి వారంలో పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

దేశంలోని రైతు కుటుంబాలకు ఆర్థిక మ‌ద్ద‌తు అవ‌స‌రం.. అలాగే ఉత్పాదకత‌,వైవిధ్యభరితమైన, స్థిరమైన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 2, 2019న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM-KISAN) ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున మూడు వాయిదాల‌లో వత్సరానికి రూ. 6,000 ఆర్థిక‌సాయం పొందుతారు. ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మోడ్ ద్వారా అర్హత పొందిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు న‌దును నేరుగా బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని మొదట 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఆర్థిక‌సాయం అందుకునేందుకు రైతులు వారి e-KYC పూర్తి చేయాలి. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, “PM కిసాన్ ఫండ్‌ను స్వీకరించడానికి eKYC తప్పనిసరి. OTP-ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.”

PM కిసాన్ eKYCని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?

PM కిసాన్ eKYCని OTPతో ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. PM కిసాన్ e-KYC అప్‌డేట్ కోసం ఇక్కడ దశల వారీ గైడ్ ఉంది

OTP ఆధారిత eKYC

  • అధికారిక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, “సెర్చ్” బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ లో న‌మోదైన మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేయండి..
  • “ “Get Mobile OTP” అనే ఆప్ష‌న్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు ఒక వ‌న్ టైం వెరిఫికేష‌న్ కోడ్ వ‌స్తుంది.
  • పోర్టల్‌లో అందుకున్న OTPని నమోదు చేసి, ఆపై “Submit for Auth” బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత, మీ PM కిసాన్ KYC అప్‌డేట్ పూర్తయింది.

PM కిసాన్ KYC స్టాట‌స్ ను ఇలా చెక్ చేయండి

మీ PM కిసాన్ KYC స్టాట‌స్ ను చెక్ చేయ‌డానికి ఈ సింపుల్ స్టెప్స్ ను పాలో కండి..

  • మొద‌ట PM Kisan KYC Status Page సందర్శించండి..
  • అక్క‌డ క‌నిపించిన‌ ఫీల్డ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి
  • ‘Search’ బటన్‌పై క్లిక్ చేయండి
  • వెంట‌నే పేజీ మీ PM కిసాన్ KYC స్టాట‌స్ ను ప్రదర్శిస్తుంది. ఇది KYC విజయవంతంగా పూర్తయిందా లేదా అవ‌స‌ర‌మైతే త‌ర్వాత ఏం చేయాలో సూచిస్తుంది.

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • ఇప్పుడు, పేజీకి కుడి వైపున ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను పూరించండి . ‘Get Data’ ఆప్ష‌న్ ను ఎంచుకోండి
  • వెంట‌నే లబ్ధిదారుడి స్టాట‌స్ కంప్యూట‌ర్ స్క్రీన్ పై క‌నిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి

PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా 2024లో మీరు చేరారా లేదా తనిఖీ చేయడానికి, ఈ స్టెప్స్ ను ఫాలో కండి..

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించండి
  • హోమ్‌పేజీలో “PM Kisan Beneficiary List” మెనుపై క్లిక్ చేయండి.
  • అందులో క‌నిపిస్తున్న ఆప్ష‌న్ల‌లో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, తహసీల్, గ్రామం, బ్లాక్‌ని ఎంచుకోండి.
  • ఆ త‌ర్వాత ‘Get report’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా 2024 మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

PM కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎలా దరఖాస్తు చేయాలి..

మీరు కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. pm kisan.gov.in లో మీరు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. PM కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఒక‌సారి చూడండి..

  • pmkisan.gov.in వెబ్ సైట్ ని సందర్శించండి
  • ‘New Farmer Registration’ పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా నింపండి
  • అవసరమైన వివరాలను నమోదు చేసి,‘Yes’పై క్లిక్ చేయండి
  • PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి, దానిని సేవ్ చేయండి . ముందు జాగ్ర‌త్త కోసం భ‌విష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *