Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

Spread the love

Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు.

భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ రంగంలో మంచి డిమాండ్‌ను తీసుకొని వస్తున్నాయి. తాజాగా తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదలైంది.

ఈవీ మార్కెట్లోనే తొలి సారిగా సీ- త్రూ గ్లాస్‌ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ  ప్రవేశ పెట్టింది..  విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి ట్రాన్స్పరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది.. అయితే.. ఈ బాడీవర్క్‌ మోడల్‌ను ఇంకా ప్రొడక్షన్‌లో పెట్టలేదని సంస్థ వెల్లడించింది.

దీనికి బదులుగా ప్రస్తుతం Primo E-Scooter ను  నాలుగు కలర్స్‌ బ్లాక్‌, సిల్వర్‌, రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్స్‌లో  కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర  రూ. 79,999.

స్కూటర్‌ బ్యాటరీ ప్యాక్‌

జితేంద్ర ఈవీ ప్రైమో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లో 60 V, 26 Ah బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు.. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 65 కి.మీ రేంజ్‌ ఇస్తుంది.. గంటకు 52 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.

Primo E-Scooter ఫీచర్స్

ప్రైమో ఈవీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, స్ప్రింగ్‌ కాయిల్‌తో కూడిన హైడ్రాలిక్‌ ఫోర్క్‌ను కలిగి ఉంటుంది. కాగా ఈ స్కూటర్‌ ప్రస్తుతానికి ఒకటే వేరియంట్‌ ను తీసుకొచ్చారు. కాగా త్వరలో  Primo S, Primo S+ పేరుతో కొత్త స్కూటర్లను లాంచ్ చేయాలని  సంస్థ భావిస్తున్నది. వీటి రేంజ్ వరుసగా 90, 130కి. మీ గా ఉండనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే కొత్త ప్రైమో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఎకానమీ, హై స్పీడ్‌, బూస్ట్‌ రైడింగ్‌ వంటి మోడ్‌లను చూడవచ్చు.ఇందులో సంస్థ తీసుకొచ్చింది. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌, USB ఛార్జింగ్‌.., సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, రివర్స్‌ అసిస్ట్‌.. థర్మల్‌ ప్రాపగేష న్‌ అలర్ట్‌ లాంటి అధునాతన ఫీచర్లను ఈ స్కూటర్‌లో చూడవచ్చు..

కొత్త ప్రైమో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లో 90/90 10 అంగుళాల ట్యూబ్‌లెస్‌ టైర్లను అమర్చారు. బ్రేకింగ్‌ విషయానికొస్తే ఇందులో ముందు డిస్క్‌ బ్రేక్‌, వెనుక డ్రమ్‌ బ్రేక్‌ సెటప్ ఉంటుంది. ఈ  స్కూటర్‌ పై సంస్థ మూడేళ్ల వారంటీ ఇస్తుంది. బ్యాటరీపై రెండేళ్ల వారంటీతో పాటు అదనంగా ఒక సంవత్సరం ఎక్స్టెండెడ్ వారంటీని పొందవచ్చు.

కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నది.. ఇదే సెగ్మెంట్‌లో లాంచ్‌ అయిన కైనెటిక్‌ గ్రీన్‌ జులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు గట్టి పోటీ ఇస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఈ కొత్త ఏడాదికి.. కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రైమో స్కూటర్‌ను ఒకసారి  పరిశీలించవచ్చు.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *