Home » Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

Hero Electric Optima CX 2.0
Spread the love

భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.

Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల వరకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.. ఈ EVలు ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్‌లతో కొత్తగా కనిపిస్తున్నాయి.

Optima CX2.0 స్పెషఫికేషన్స్..

Hero Electric Optima CX2.0 లో 2kWh బ్యాటరీ ప్యాక్‌ ని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 89 కి.మీల రేంజ్ ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 1.9 kW మోటారుకు శక్తినిస్తుంది. ఇది గంటకు  48 kmph వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ నాలుగైదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Hero Electric Optima CX5.0 ఫీచర్స్

Hero Electric Optima CX5.0 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో 113 కిమీల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ 55 kmph వేగంతో  వెళ్తుంది. ఇందులో 1.9 kW మోటార్‌ ను అమర్చారు.

అదేవిధంగా, NYX CX5.0 Optima CX5.0 వలె అదే బ్యాటరీ, అదే మోటారుతో 48 kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

Optima CX5.0 డార్క్ మ్యాట్ బ్లూ, మాట్ మెరూన్ రంగులలో అందుబాటులో ఉంది. Optima CX.20 మా డీలర్‌షిప్, పాన్-ఇండియాలో అందుబాటులో ఉన్న డార్క్ మ్యాట్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇక  NYX చార్‌కోల్ బ్లాక్, పెరల్ వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Hero Electric Optima

ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

క్రిస్టమస, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ 2.0 ఎలక్ర్టిక్ స్కూటర్ పై రూ.4000 వరకు  డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈమేరకు హన్మకొండ హంటర్ రోడ్డులోని హీరో ఎలక్ట్రిక్ షోరూం ఎస్ఆర్ఎస్ మోటార్స్ ఎండీ సురేష్ తౌటం తెలిపారు. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని ఆసక్తిగలవారు షోరూంలో సందర్శించాలని సూచించారు.

 


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *