Sunday, February 9Lend a hand to save the Planet
Shadow

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Spread the love

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంపోస్టు ఎరువు

పంటల సాగులో మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారు చేసుకోవచ్చు.. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, తగినంత తగినంత పొడవు గొయ్యి తవ్వాలి.. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేర్చుకుంటూ.. మధ్య మధ్యలో.. పేడ నీళ్లను, 8-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి అర మీటరు ఎత్తు వరకు నింపాలి. పైన పేడ మట్టితో చక్కగా అలకాలి. 3-4 నెలల్లో వ్యర్థాలు కుళ్లిపోయి కంపోస్టు తయారవుతుంది. పట్టణ వ్యర్థాలతోనూ కంపోస్టు ఎరువులు చేయవచ్చు. గ్రామీణ కంపోస్టులో కన్నా పట్టణ కంపోస్టులో అధిక పోషకాలు ఉంటాయి.

బయోగ్యాస్‌ (biogas)

చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని కొన్ని రోజుల పాటు ట్యాంకుల్లో గాలి తగలకుండా మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల  చర్య కారణంగా వెలువడే ఇంధన వాయువును బయో గ్యాస్‌ (గోబర్‌ గ్యాస్‌) అని అంటారు. దీనిలో 50-60 శాతం మీథేన్‌, 30-40 శాతం బొగ్గుపులుసు వాయువు, 10 శాతం హైడ్రోజన్‌ వాయువు ఉంటాయి. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.

పశువుల పేడ ఎరువు

పశువుల సంఖ్యను బట్టి కొట్టాల వద్ద తగినంత పొడవు, వెడల్పుతో 3 అడుగుల లోతు గల గుంతను తవ్వుకోవాలి.. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డిని గోతి లో 6 అంగుళాల ఎత్తు వరకు నింపాలి. దానిపై  నీటిని చిలకరించి, 2-3 కి. సూపర్‌ఫాస్పేట్‌ వేసి మట్టితోగానీ, బురదతో గానీ కప్పాలి. ఇలాగే భూ మట్టానికి 1-1.5 అడుగుల ఎత్తు వరకు గోతి మొత్తం నింపుతూ మట్టితో లేదా బురదతో కప్పాలి.. 3-4 నెలల్లో బాగా కుళ్లిపోయి నేలలో వేయటానికి తయారుగా ఉంటుంది.

జీవాల ఎరువు

Organic fertilizers.. మేకలు, గొర్రెల కొట్టం నుంచి వచ్చే ఎరువును భద్రపరిచి ఉపయోగించుకోవాలి. వేసవి కాలంలో రాత్రి పూట వీటిని నేరుగా పంట పొలాల్లో మంద కట్టడం వల్ల వీటి మల, మూత్రాలు నేరుగా పొలంలో పడి మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.

పౌల్ట్రీ/కోళ్ల ఎరువు

40 కోళ్ల నుంచి వచ్చే వ్యర్థల నుంచి సంవత్సరంలో టన్ను ఎరువు తయారవుతుంది.. కేజెస్‌ కన్నా డీప్‌లిట్టర్‌ ఎరువులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కేజెస్‌ ఎరువులో తేమ తగ్గే కొద్దీ పోషక శాతం పెరుగుతుంది. షెడ్‌ నుంచి తీసిన తరువాత టన్ను కోడి ఎరువుకు 5-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ కలిపి కొన్ని రోజుల పాటు గొయ్యిలో/ కుప్పలు గా పోసి వాడటం వల్ల పోషకాలు పెరుగుతాయి.. ఎకరానికి సాధారణ పంటలన్నింటికి 2 టన్నులు, చెరకు కు 3 టన్నుల చొప్పున కోళ్ల ఎరువు వేయవ చ్చు. నీటి వసతి ఉన్న పొలాల్లో ఈ ఎరువు బాగా పని చేస్తుంది. దీనిలో సూక్ష్మ పోషకాలు కూడా బాగా ఉంటాయి.

పచ్చిరొట్ట ఎరువులు

జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము,. అవిసె ఇతర పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో నేలలో చక్కగా కలియదున్నాలి. ఇవి నేలలో సేంద్రియ పదార్థాన్ని చేరుస్తాయి. వేర్ల బుడిపె ల్లోని సూక్ష్మజీవులు పంటలకి కావలసిన  నత్రజనిని  అందిస్తాయి. ఎకరానికి జనుము 20-25 కిలోలు, జీలుగ 12-15 కిలోలు, పిల్లి పెసర 5-6 కిలోలు,, అలసంద 14-15 కిలోలు, పెసర, మినుము 6-7 కిలోల విత్తనం వినియోగించుకోవాలి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..