Pure eTryst 350 E-bike వచ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు
Pure eTryst 350 E-bike : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియన్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ..
ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ మార్కెట్‌లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ప్యూర్ ఈవీ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 కంపెనీ కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.
ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్ అని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ప్రారంభ దశలో భాగంగా ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ ను టైర్ I నగరాల్లో అందుబాటులో ఉంటుందని, దేశవ్యాప్తంగా 100 డీలర్‌షిప్‌లలో ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయవచ్చని ప్యూర్ ఈవీ తెలిపింది.
గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు
ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ నడపడానికి తప్పనిసరిగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం. ఇందులో పెద్ద 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను ప్యూర్ ఈవీ కంపెనీయే తయారు చేసింది. ఈ బ్యాటరీకి AIS 156 సర్టిఫికేట్ లభించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపింది.
Pure eTryst 350 E-bike లోని బ్యాటరీ ఎటువంటి కఠినమైన ప్రయాణ వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించబడింది. అందుకే ప్యూర్ ఈవీ ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ బ్యాటరీ ప్యాక్‌పై 5 ఏళ్లు, లేదా 50,000 కిమీ వారంటీని అందిస్తోంది. అంతేకాకుండా, ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ ప్రత్యేకంగా ఇండియన్ రోడ్లకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది. భారత రోడ్లపై దీనిని బాగా పరీక్షించిన తర్వాతనే ప్రజల ముందుకు తీసుకువచ్చామని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ సంప్రదాయ 150సీసీ పెట్రోల్ మోటార్‌సైకిళ్లకు పోటీగా ఉంటుంది. ఈట్రిస్ట్ 350 బైక్ లోడ్ కెపాసిటీ 150 కిలోలు. ఇది 84V 8A ఛార్జర్ తో వస్తుంది. దీంతో ఈ-బైక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పంచ్ బ్లాక్, టాన్ రెడ్, సీ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
మూడు రైడ్ మోడ్స్
ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ లో మూడు రైడ్ మోడ్స్ ఉంటాయి. వీటిలో డ్రైవ్ మోడ్ – ఇది ఇ-బైక్ గరిష్ట వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లకు పరిమితం చేస్తుంది. రెండవ మోడ్‌ను క్రాస్ ఓవర్ – ఇది గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లు ఉంటుంది. మూడవది థ్రిల్ మోడ్ – ఇది రైడర్‌కు ఇ-బైక్ యొక్క గరిష్ట శక్తిని ఇస్తుంది. అంటే గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
రోజువారీ అవసరాలకు అనుగుణంగా ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్యూర్ ఈట్రిస్ట్ 350 సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌గా మాత్రమే కాకుండా అధిక పనితీరు గల ఈ-బైక్‌గా కూడా అభివృద్ధి చేయబడింది. కాబట్టి, తక్కువ ధరలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న యువతకు ఈ బైక్ నచ్చుతుంది. ఇది ఈ విభాగంలో Revolt RV400, Tork Kratos కబీవంటి ఎలక్ట్రిక్ బైక్‌లతో పోటీపడనుంది.
Good