మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike

revolt RV 400
Spread the love

Revolt electric bike : వినియోగ‌దారుల నుంచి వ‌స్తున్న డిమాండ్ కార‌ణంగా రివోల్ట్ ఈవీ కంపెనీ విస్త‌ర‌ణ బాట‌ ప‌ట్టింది. ఈ నవంబర్‌లో ఈ ఐదు కొత్త నగరాల్లో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్‌లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఇంధ‌న ఖ‌ర్చ‌లను త‌గ్గించుకునేందుకు వినియోగ‌దారులు ఈవీల వైపు మ‌ళ్లుతున్నారు. అయితే రివోల్ట్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవ‌లం రూ.9 తో 100 కి.మీకి ప్ర‌యాణం రివోల్ట ఈ-బైక్‌ల‌తో సాధ్య‌మ‌వుతంద‌ని చెబుతోంది.

Revolt electric bike వాహన తయారీ సంస్థ విశాఖ‌ప‌ట్నం, విజయవాడలతో స‌హా కోల్‌కతా, కోయంబత్తూర్, మధురై వంటి ఐదు కొత్త నగరాల్లో డీలర్‌షిప్‌లను తెరవడం ద్వారా దేశంలో కంపెనీ విస్త‌రణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ ఐదు నగరాల్లో ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ప్రారంభించడంతో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 14 ప్రధాన నగరాల్లో రెవోల్ట్ 19 డీలర్‌షిప్‌లను కలిగి ఉంటుంది. ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్లు వినియోగదారులకు సేల్స్‌, స‌ర్వీస్ తోపాటు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విడిభాగాలను అందిస్తాయి. పండుగ సీజన్‌కు ముందు అక్టోబర్‌లో మూడు నగరాల్లో రివోల్ట్ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది.

85కి.మీ వేగం

రివోల్ట్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయితే RV400 ఎల‌క్ట్రిక్ బైక్ 3KW (మిడ్ డ్రైవ్) మోటారుతో వస్తుంది. ఇందులో 72V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీని పొందుప‌రిచారు. ఈ బైక్ గరిష్టంగా 85 km/h వేగంతో దూసుకుపోతుంది.

స్మార్ట్ ఫీచ‌ర్లు..

రివోల్ట్ ఈ బైక్‌లో ప‌లు స్మార్ట్‌ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇందులో లొకేటర్/జియో ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా రివోల్ట్ బైక్‌ను ఆపరేట్ చేయవచ్చు, స్క్రీన్‌పై ఒక్కసారి ప్రెస్ చేయ‌డం ద్వారా మీరు మార్చగలిగే కస్టమైజ్డ్ సౌండ్‌లు, పూర్తి బైక్ డయాగ్నస్టిక్‌లు, బ్యాటరీ స్థితి, మీ రైడ్‌లు, కిలోమీటర్ల రైడింగ్ హిస్ట‌రీ డేటా పొంద‌వ‌చ్చు. రివోల్ట్ బ్యాటరీని మార్చుకోవడానికి సమీపంలోని రివోల్ట్ స్విచ్ స్టేషన్‌ను గుర్తించే ఎంపిక కూడా ఉంది.

ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది – ఎకో, నార్మల్ అలాగే స్పోర్ట్. ప్రతి ఒక్కటి రైడింగ్ స్టైల్ .. డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. RV400 అప్‌సైడ్ డౌన్ (USD) అప్-ఫ్రంట్ ఫోర్క్‌లతో అలాగే వెనుకవైపు పూర్తిగా అడ్జ‌స్ట‌బుల్ చేయగల మోనోషాక్‌తో వస్తుంది.


Revolt RV 400 electric bike Specifications
  • Brakes(CBS) Front Disc(240mm) / Rear Disc(240mm)
  • Tyres Front – 90/80-17, Rear – 120/80-17
    Front Fork Upside Down Forks
  • Rear Suspension Monoshock(Adjustable)
  • Battery Type Lithium Ion
  • Voltage/Wattage 72V, 3.24KWh
  • Charging Time 0-75% in 3 Hours And 0-100% in 4.5 Hours
  • Motor 3KW (Mid Drive)
  • Weight 108Kg
  • Wheel Base 1350mm
  • Seat Height(Rider) 814mm
  • Carrying Capacity 2 Persons/Maximum 150Kg
  • Lighting LED Head Lamp(Projection for High beam), Tail Lamps And Indicators (All LED)
  • Ground Clearance 215mm
  • Range 150kms(Eco Mode), 100kms(Normal Mode), 80kms(Sports Mode)

One Reply to “మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *