రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025
Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు వరుసగా రెండు అవార్డులను గెలుచుకున్న ఏకైక భారతీయ ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది.
ఇండీ స్కూటర్ ప్రత్యేకతలు ఏమిటి?
ఇండీ స్కూటర్ వినియోగదారుని కేంద్రీకృతమైన ఫంక్షనల్ డిజైన్‌కి గుర్తింపు పొందింది. ఇందులో మిగతా స్కూటర్ల కంటే అత్యధికంగా 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ తోపాటు అలాగే ఫ్రంట్ కంపార్ట్‌మెంట్ లో 12 లీటర్ల స్టోరేజ్ ఉంది. ఇవి ఈ విభాగంలో అత్యధిక సామర్థ్యంగా గుర్తింపు పొందింది. అదనంగా, లాక్-అండ్-లోడ్ పన్నీర్ స్టేలు, రక్షణాత్మక గార్డులు, ట్విన్ బీమ్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు ఫుట్ పెగ్‌లు వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Indie Electric Scooter : ఇండీ ముఖ్య డిజైన్ యుటిలిటీ లక్షణాలు:
అత్యధిక స్టోరేజ్ సామర్థ్యం: సీటు కింద 43 లీటర్లుచ ముందు కంపార్ట్‌మెంట్‌లో 12 లీటర్లు నిల్వను అందిస్తుంది.
అనుకూలీకరించదగిన లగేజ్: అనుకూలీకరించదగిన లగేజ్ పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. రెండు వైపులా లాక్-అండ్-లోడ్ పన్నీర్ స్టేలను కలిగి ఉంటుంది.
ప్రత్యేక రక్షణ: పడిపోయినప్పుడు స్కూటర్ డామేజ్ కాకుండా ప్రత్యేకమైన రక్షణ డిజైన్ ఫీచర్ అయిన “సేఫ్‌గార్డ్స్”ను కలిగి ఉంటుంది.
మెరుగైన లైటింగ్ : విలక్షణమైన ట్విన్-బీమ్ హెడ్‌ల్యాంప్‌లు, ప్రత్యేకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇండీకి దాని ఐకానిక్ లుక్‌ను ఇస్తాయి.
రైడర్ కంఫర్ట్: సురక్షితమైన, సౌకర్యవంతమైన రైడింగ్, మెరుగైన ఫ్లోర్‌బోర్డ్ యుటిలిటీ కోసం ఫ్రంట్ ఫుట్ పెగ్‌లతో రూపొందించబడింది.
రివర్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ విపిన్ జార్జ్ మాట్లాడుతూ, ఈ అవార్డు సంస్థకు ఉన్న రైడర్-కేంద్రీకృత డిజైన్ కు గౌరవసూచకమని అన్నారు. “భారతీయ రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండీని మల్టీ యుటిలిటీ వాహనంగా రూపొందించాము,” అని ఆయన పేర్కొన్నారు.
కాగా రెడ్ డాట్ డిజైన్ అవార్డు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత డిజైన్ ప్రామాణికంగా పరిగణించబడుతుంది. రివర్ మొబిలిటీ స్కూటర్ ఈ గుర్తింపును పొందడానికి కారణం — రవాణా సౌకర్యం, రక్షణ, ప్రాయోగికతను సమన్వయం చేసిన ప్రత్యేక డిజైన్ అని చెప్పవచ్చు.
ఇక 2021 మార్చిలో అరవింద్ మణి, విపిన్ జార్జ్ స్థాపించిన రివర్ మొబిలిటీ, ప్రస్తుతం బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థ పెట్టుబడిదారులలో యమహా మోటార్ కార్పొరేషన్, మిట్సుయ్ & కో. లిమిటెడ్, మారుబేని కార్పొరేషన్, అల్ ఫుట్టైమ్ గ్రూప్, లోయర్‌కార్బన్ క్యాపిటల్, టయోటా వెంచర్స్, మానివ్ మొబిలిటీ, ట్రక్స్ విసి ఉన్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..


