Nandyal Solar Project

Solar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్‌లు

Spread the love

Nandyal Solar Project | పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు పడింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలోని నవరత్న CPSU సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి ప‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సమ్మిట్ 2025లో ఎనర్జీ సెషన్ సందర్భంగా ఈ ఒప్పంద మార్పిడి జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ & అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ, CIIతో కలిసి నిర్వహించింది.

Solar Project వివరాలు

▪️ మార్కెట్ ఆధారిత కార్యకలాపాల కింద 1200 MWh BESS ప్రాజెక్టుకు SECIని అమలు సంస్థ గా విద్యుత్ మంత్రిత్వ శాఖ 2025 జనవరి 23న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
▪️ ప్రాజెక్టుల అమలు ప్రతిపాదనను SECI బోర్డు ఛైర్మన్ సంతోష్ కుమార్ సారంగి 2024 అక్టోబర్ 22న ఆమోదించారు.
▪️ రెండు ప్రాజెక్టులపై MNRE నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు CAPEX మోడ్‌లో అమలు చేయబడతాయి. అవసరమైన పెట్టుబడులన్నీ SECI భరించనుంది.

అధికారుల సమక్షంలో GOల అందజేత

ఆంధ్రప్రదేశ్ ఇంధన మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, NREDCAP వైస్ చైర్మన్ ఎం.కమలాకర బాబు సమక్షంలో SECI అధికారులకు GOలు అందజేశారు. SECI తరఫున శివకుమార్ వెంకట్ వేపకొమ్మ, రోహిత్ చౌబే హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఇంధన దిశగా ముందడుగు

ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. భారీ స్థాయి BESS వ్యవస్థ, హైబ్రిడ్ సోలార్‌ ప్రాజెక్టు అమలు రాష్ట్ర పునరుత్పాదక పర్యావరణ వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తాయని MNRE పేర్కొంది. SECI కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసి దేశాన్ని మరింత స్థిరత్వం గల పచ్చ ఇంధన గ్రిడ్ వైపు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని తెలిపింది.

More From Author

Organic Farming

Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *