Home » Simple One e-scooter బిగ్ అప్‌డేట్‌

Simple One e-scooter బిగ్ అప్‌డేట్‌

Simple one
Spread the love
Simple one
Simple one electric scooter

జూన్ 2022 నుంచి డెలివరీలు షురూ..

Simple One e-scooter కోసం ఎదురుచూస్తున్న‌వారికో శుభ‌వార్త‌. ఈ స్కూట‌ర్ కోసం బుకింగ్ చేసుకున్న‌వారికి ఈ ఏడాది జూన్‌లో వాహ‌నాల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని సింపుల్‌వ‌న్ పేర్కొంది.
బెంగళూరుకు చెందిన electric scooter స్టార్టప్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ గత సంవ‌త్స‌రం ఆగస్టులో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే.  సింపుల్ ఎనర్జీ వారి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధ‌ర(ఎక్స్-షోరూమ్) రూ.1.10లక్షలతో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు చాలా కాలం క్రిత‌మే ప్రారంభించి ఉన్నారు. అయితే తాజాగా కంపెనీ దాని డెలివరీ టైమ్‌లైన్‌ను  ప్ర‌క‌టించింది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ-మొబిలిటీదే భ‌విష్య‌త్తు..

సింపుల్ వన్ స్కూట‌ర్ గురించి సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ..  “ఎలక్ట్రిక్ మొబిలిటీదే భవిష్యత్తు అని అన్నారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేయడం, ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం సరసమైన, ప్ర‌భావంత‌మైన ఉత్ప‌త్తుల‌ను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంపైనే తమ ప్ర‌ధాన దృష్టి అని పేర్కొన్నారు. సింపుల్ వన్‌పై మార్కెట్లో వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషంగా ఉన్నామ‌ని చెప్పారు.
మా R&D, డిజైన్ / ఇంజినీరింగ్ విభాగం వ‌ద్ద అత్యుత్తమ ఆలోచనలు ఉన్నాయని,  సింపుల్ వన్ కస్టమర్ల అంచనాలను అధిగమిసామ‌ని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Simple One e-scooter స్పెసిఫికేష‌న్స్

సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ స్పెసిఫికేష‌న్ విష‌యానికొస్తే .. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.8 kWh రిమూవ‌బుల్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుప‌రిచారు. ఎలక్ట్రిక్ మోటారు 7 kW (9.38 hp) గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఇది 72 Nm గరిష్ట టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ఈ స్కూట‌ర్ గంట‌కు గంటకు 105 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది.

సింగిల్ చార్జిపై 203కి.మి రేంజ్‌

సింపుల్ వన్ ఎకో మోడ్‌లో 203 కి.మీల వరకు ప్ర‌యాణిస్తుంది. అయితే దీని IDC పరిధి 236 కి.మీ.  సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించి దాని పోర్టబుల్ బ్యాటరీ/ ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను వరుసగా ఛార్జ్ చేయడానికి 75 నిమిషాల /165 నిమిషాలు పడుతుందని కంపెనీ పేర్కొంది.
ఇటీవ‌ల సింపుల్ ఎనర్జీ ధర్మపురిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్‌ను నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

 

One thought on “Simple One e-scooter బిగ్ అప్‌డేట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *