Home » 13 రాష్ట్రాల్లో సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

13 రాష్ట్రాల్లో సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

Simple-Energy-electric-scooter
Spread the love

ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు సిద్ధం

Simple One electric scooter మొద‌టి విడ‌త‌తో ఒకేసారి 13 రాష్ట్రాల్లో లాంచ్ చేయ‌నున్నారు. ఈ స్టైలిష్ స్మార్ట్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగ‌దారులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.  ఇందులో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు.  ఇది ఒక‌సారి చార్జి చేస్తే ఎకో మోడ్‌లో 240 కిమీలు ప్ర‌యాణిస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.  దీని టాప్ స్పీడ్‌100 kph. గంటకు 0-50 కిమీ వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకుంటుద‌ని కంపెనీ పేర్కొంది.

ఆగ‌స్టు 15న విడుద‌ల‌

బెంగళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ కొన్నేళ్ల క్రిత‌మే Simple One electric scooter వివ‌రాలు మరియు విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.  కంపెనీ తన ప్రధాన ఈ-స్కూటర్ సింపుల్ వన్‌ను ఆగస్టు 15 న బెంగళూరులో ఆవిష్కరించ‌నుంది.  ఈ కంపెనీ బ్రాండ్ బెంగుళూరు, చెన్నై మరియు హైదరాబాద్‌లో ప్రారంభిస్తామ‌ని ప్రకటించినప్పటికీ, ఫేజ్ 1 లో ఇతర నగరాలను కూడా చేర్చారు.  సింపుల్ ఎనర్జీ తమిళనాడులోని హోసూర్‌లోని తన ఫ్యాక్టరీలో ఏటా 10 లక్షల యూనిట్లను సిద్ధం చేసే సామర్థ్యం ఉంది. ఇక సింపుల్ వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ క‌లిగి ఉంది. ఎకో మోడ‌ల్‌లో 240 కిమీ రేంజ్ ఇస్తుంది. గ‌రిష్ట వేగం 100 kph క‌లిగి ఉంది.

మొద‌ట తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్,  గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు పంజాబ్ రాష్ట్రాల్లోని ప‌లు నగరాల్లో  సింపుల్ ఎనర్జీ సంస్థ సింపుల్ వ‌న్ స్కూట‌ర్ల‌ను ఆవిష్క‌రించ‌నుంది.  ఇందులోభాగంగా ఎక్స్‌పీరియ‌న్స్ సెంటర్ల‌ను కూడా త్వరలో ఏర్పాటు చేయ‌నుంది. తద్వారా డెలివరీలను స్టార్ట్ చేయ‌డానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Simple One electric scooter వాహనాన్ని బుక్ చేసుకోవడానికి  భారతదేశంలోని అనేక నగరాల నుండి త‌మ‌కు ఎన్నో రిక్వెస్ట్‌లు అందుతున్న‌య‌ని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ విన‌తుల‌ను పరిష్కరించాల్సిన అవసరం ఉందని,  అందుకోస‌మే ఫేజ్ 1 ప్లాన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.  ఆగ‌స్టు 2021లోనే దేశ‌వ్యాప్తంగా బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తున్నామ‌ని అని సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు సీఈవో సుహాస్ రాజ్‌కుమార్ అన్నారు.

ధర సుమారు రూ.1,10,000 నుండి రూ.1,20,000

Simple One electric scooter మిడ్ డ్రైవ్ మోటార్‌తో పాటు డిటాచ‌బుల్( వేరుచేయ‌గ‌లిగిన) బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ మొదలైన స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది, సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.1,10,000 నుండి రూ .1,20,000 వరకు ఉంటుంది.

  • Mileage-Range 260 km/charge
  • Charging Time 1 hour 5 minutes
  • Max Power 9.51 PS
  • Torque 72 Nm
  •  Drive Type Hub Motor
  • Starting Push Button Start
  • Transmission Automatic
  • Battery Type Lithium Ion
  • Battery Capacity 4.2 kwh

 

హీరో ఆప్టిమా ఎల్ ఎక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ స్పెసిఫికేష‌న్స్‌

 

One thought on “13 రాష్ట్రాల్లో సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *