Srinagar Tulip Garden | శ్రీనగర్ లోని ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్ ప్రజలకోసం శనివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూతల స్వర్గంలా కనిపిస్తోంది.
ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. “తులిప్ గార్డెన్‌ను ప్రజల కోసం తెరిచారు” తులిప్ పూవులు దశలవారీగా పుష్పిస్తాయి. తద్వారా పువ్వులు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తోటలో ఉంటాయి. “తోట పూర్తిగా వికసించినప్పుడు, తులిప్‌ల ఇంద్రధనస్సుగా కనిపిస్తుంది. అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 68 రకాల తులిప్‌లకు అదనందగ ఈ ఏడాది ఐదు కొత్త రకాల తులిప్‌లను చేర్చినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు లక్షల పుష్పాలను జోడించి తులిప్ గార్డెన్ విస్తీర్ణాన్ని కూడా పెంచింది. 55 హెక్టార్లలో విస్తరించి ఉన్న తోటలో రికార్డు స్థాయిలో 17 లక్షల తులిప్ బల్బులు నాటినట్లు అధికారులు తెలిపారు. తోటలో వివిధ రకాల పువ్వులు రంగులను జోడించడానికి హైసింత్స్, డాఫోడిల్స్, మస్కారి, సైక్లామెన్స్ వంటి ఇతర పూల మొక్కలను కూడా ప్రదర్శనలో ఉంటాయని వారు తెలిపారు.
నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకున్న 50,000 తులిప్ బల్బులతో గార్డెన్ చిన్నగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే పర్యాటకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. ఈ గార్డెన్ ను చూసేందుకు ప్రతి సంవత్సరం పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు.
గత ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకులు 3.65 లక్షల మంది గార్డెన్‌ను సందర్శించగా, 2022లో 3.60 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఫొటోలు, వీడియోలను చిత్రీకరించడానికి అత్యంత ప్రసిద్ధమైన గార్డెన్ గా ఈ తులిప్ గార్డెన్ నిలుస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక చిత్రయూనిట్లు గత సంవత్సరం ఇక్కడ సినిమాలను చిత్రీకరించాయి. సందర్శకుల సౌకర్యార్థం డిపార్ట్‌మెంట్ దాదాపు 22,000 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చిందని అధికారి ఒకరు తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.