Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

Spread the love

Solar Panel Installation | దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అనేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి ‘PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ‘(Surya Ghar Muft Bijli Yojana) ‘ ఇది మీ విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. అంతే కాదు, దాని సహాయంతో ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సౌర విద్యుత్ పథకం అనేది భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద, గృహాలు వారి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి రాయితీలు అందిస్తుంది. సోలార్ ప్యానెళ్ల (Solar Panels) ధరలో 40% వరకు సబ్సిడీ వర్తిస్తుంది. ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కేంద్రం ఉద్యోగాల కల్పనకు సిద్ధమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేసుకున్నవారికి వారికి కేంద్రం రూ.78,000 వరకు రాయితీలు అందజేయనుంది. అయితే సోలార్ ప్యానల్ ఇన్ స్టలేషన్ తోపాటు మెయింటెనెన్స్ పై సుమారు 100,000 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

50 వేల మంది విక్రేతలకు శిక్షణ

రిన్యూవబుల్, స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖలు కలిసి పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజిలీ యోజన (Muft Bijli Yojana)’ కోసం “నైపుణ్య ప్రణాళిక”ను అభివృద్ధి చేశాయని తెలుస్తోంది. దీనికి కింద సుమారు 10,0000 మందికి శిక్షణ ఇవ్వనుంచి అవసరాన్ని బట్టి శిక్షణ పొందేవారి సంఖ్యను పెంచవచ్చు. సోలార్ రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రాం కోసం నోడల్ ఏజెన్సీ అయిన REC లిమిటెడ్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రూఫ్ టాప్ సోలార్ సిస్టం ను ప్రోత్సహించేందుకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముందుగా సోలార్ ప్యానల్స్ ఇన్ స్టలేషన్ ( Solar Panel Installation) పై  నైపుణ్యం కలిగిన సిబ్బందిని పెంచనుంది. మరోవైపు ఈ పథకం అమలు చేయడానికి మరొక అడ్డంకి గణనీయమైన సంఖ్యలో సోలార్ ప్యానెల్స్ విక్రేతలు అవసరం దీంతో సుమారు 50,000 మంది విక్రేతలకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఒక అధికారి తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో రిజిస్టర్ చేసుకునే ప్రస్తుత వ్యవస్థకు విరుద్ధంగా, ఎక్కువ మంది విక్రేతలు నేషనల్ రూఫ్‌టాప్ సోలార్ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *