Electric Scooter | భారత్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలదే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వినియోగం ఊహించనంతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బడా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh, 2.5kWh, 3kWh బ్యాటరీ ప్యాక్‌లలో మూడు విభిన్నమైన వేరియంట్‌లలో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 170కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్..
iVOOMi JeetX ZE ఎలక్ట్రిక్ స్కూటర్ 8 ప్రీమియం రంగులలో అందుబాటులో ఉంటుంది. రంగు ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:
- నార్డో గ్రే
- ఇంపీరియల్ రెడ్
- అర్బన్ గ్రీన్
- పెర్ల్ రోజ్
- ప్రీమియం గోల్డ్
- సెరూలియన్ బ్లూ
- మార్నింగ్ సిల్వర్
- షాడో బ్రౌన్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే, JeetX ZE టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియో-ఫెన్సింగ్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లను చూపించేందుకు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన డిస్ప్లే ఉంటంఉది. అయితే బ్యాటరీ ప్యాక్‌లకు సంబంధించి ఛార్జింగ్ సమయం గురించి కంపెనీ వివరాలను వెల్లడించలేదు. JeetX ZE ఒక కాంపాక్ట్, 12-కిలోగ్రాముల డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది అన్ని వర్గాల వినియోగదారులకు సులభంగా రీప్లేస్‌మెంట్, రిమూవల్, రీఫిట్‌ని చేయడానికి వీలుంటుంది. పోర్టబుల్ ఛార్జర్, కేవలం 826 గ్రాముల బరువు ఉంటుంది. కస్టొమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.
కొత్త స్కూటర్ లాంచ్ పై iVOOMi సహ వ్యవస్థాపకుడు, CEO అశ్విన్ భండారి మాట్లాడుతూ “JeetX ZE అనేది EV స్పేస్‌లో అధిక-నాణ్యత ఇంజనీరింగ్ ఆవిష్కరణకు నిదర్శనం. దీని అధునాతన ఫీచర్లు, పనితీరు, స్టైల్ కావాలనుకునే వినియోగదారుకు సరైన ఆప్షన్ గా ఉంటుంది. భారతదేశంలో ఇ-మొబిలిటీ వేగవంతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నామని తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..