Organic Farming | సేంద్రియ సాగులో ఆదర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్లోకి !
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత…
