
ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రి వర్షన్-2047 గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా చూస్తున్నామని తెలిపారు. ఈ విజన్‌లో పసుపు సాగుకు మరియు రైతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.నేషనల్ టర్మరిక్ బోర్డుపై కీలక వ్యాఖ్యలునిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, అది...

