2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గమనించారా?
2022 TVS iQube వేరియంట్లు తేడాలు ఇవే..
దేశంలో ప్రఖ్యాతిగాంచిన TVS మోటార్ కంపెనీ తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఇప్పుడు లాంగ్ రేంజ్ శ్రేణితో పాటు కొన్ని ఫీచర్స్‌ను జోడించింది. మరో విశేషం ఏమిటంటే ఈ TVS iQube ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసాలను ఒకసారి పరిశీలిద్దాం..TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట 2020లో ప్రారంభించారు. ఈ మోడల్ అప్పట్లో ఒక కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే భారతదేశంలో అనేక కంపెనీ పలు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టడంతో TVS కూడా తన పంథాను మార్చుకుంది. మార్కట్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు తన మోడల్‌ను అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. 2022 సరికొత్త అప్‌డేట్‌లతో మూడు వేరియంట్‌లను తీసుకువచ్చింది. అవి iQube, iQube S, iQube ST. మూడు వేరియంట్‌లు కొన్ని చిన్న, కొన్ని పెద్ద మార్ప...