
Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్
Ultraviolette Shockwave E-bike | అల్ట్రావయోలెట్ ఈ రోజు తన రెండవ ఎలక్ట్రిక్ టూ వీలర్ (Electric Two wheeler) అయిన షాక్‌వేవ్ ఎండ్యూరో ఇ-బైక్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 1.75 లక్షలు(ఎక్స్-షోరూమ్). అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదే సమయంలో అల్ట్రావయోలెట్ కంపెనీ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు టెస్సెరాక్ట్ ఇ-స్కూటర్ (Tesseract e-scooter) ను ప్రారంభించింది. ఇది 261 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది.Ultraviolette Shockwave : మరిన్ని వివరాలుఅల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ప్రత్యేకంగా ఆఫ్-రోడ్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్ల కోసం అభివృద్ధి చేయబడిన కొత్త ప్లాట్‌ఫామ్ పై నిర్మించారు. ఫ్రేమ్ లాంగ్-ట్రావెల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్, 19-అంగుళాల ముందు టైర్.. 17-అంగుళాల వెనుక టైర్స్ ను చూడవచ్చు. మొత్తంమీద, మ...