Miyawaki Plantation | హరిత వనాలను పెంచేందుకు మియావాకీ తోటలు.. అసలేంటీ పద్ధతి..
Miyawaki Plantation | భూమండలంపై అడవులు క్షీణిస్తున్నకొద్దీ పర్యావరణ కాలుష్యం పెరిగి ఊహించని విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. హీట్ వేవ్ లు, తుఫానులు ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే కొన్ని దేశాలు మొక్కల పెంపకంపై దృష్టి సారించాయి. పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం కూడా తన గ్రీన్ కవర్‌ను 25 నుండి 33 శాతానికి విస్తరిస్తామని ప్రతిజ్ఞ చేసింది. వేగంగా మొక్కలు పెంచే పద్ధతులను ప్రపంచదేశాలు అన్వేషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జపాన్ కు చెందిన మియావాకి పద్ధతిలో అడవుల పెంపకం బాగా పాపులర్ అయింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షసంపదను పెంచేందుకు ఈ జపాన్ అడవుల పెంపకం విధానాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణకు హరిత హారం (TKHH) కింద ప్లాంటేషన్ లక్ష్యాలను సాధించడంలో ఈ పద్ధతి సహాయపడింది. అడవుల నరికివేతను నియంత్రించడానికి, దేశంలో పచ్చదనాన్ని పెంచడానికి కొత్త పద్ధతులను తీసుకురావడానికి అ...