Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మకాలు
Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గత నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది.Ather Energy sales సందర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ “ 82,146 వాహనాల రిటైల్ అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని సాధించామని, చిప్ కొరత కారణంగా ఈ FYలో మొదటి 6 నెలలపాటు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 2023 మార్చిలో డెలివరీ చేయబడిన 11,754 యూనిట్లతో ఈ సంవత్సరాన్ని విజయవంతంగా ముగించామని చెప్పారు. ఇది సంవత్సరానికి 353 శాతం వృద్ధి అని, ఈ జోరు FY24లో కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము ఈ సంవత్సరం మా రిటైల్ ఔట్లెట్లను ...