Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భారతదేశంలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన విద్యుత్ శక్తితో పరుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVలతోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భారత్ లో సంప్రదాయ పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం వల్ల ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల ప్రయోజనాలు
ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యమైన ప్రయోజనాలు
తక్కువ నిర్వహణ ఖర్చులుEVల తో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉపయోగం.. తక్కువ నిర్వహణ ఖర్చు. తరచూ మారుతున్న పెట్రోల్/డీజిల్ ధరల కంటే విద్యుత్ ధరల...