Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు
Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20 పెట్రోల్ గా తయారుచేస్తారు BPCL యొక్క E20 నెట్‌వర్క్ 4,279 ఇంధన స్టేషన్‌లకు విస్తరించింది, ఇది కంపెనీ మొత్తం స్టేషన్లలో 18% కవర్ చేస్తుంది, భారతదేశ ప్రయాణాన్ని హరిత భవిష్యత్తు వైపు నడిపిస్తుంది.పెట్రోల్, డీజిల్ దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, రైతులకు మెరుగైన వేతనం అందించడం, పర్యావరణ ప్రయోజనాలను అందించడం. వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం వంటి అనేక కీలక లక్...